Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్ట్రిక్ట్ డ్యూటీతో అదరగొడుతున్నారు. సెలబ్రిటీలైనా సరే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎక్కడికక్కడ ఫైన్లు వేసేస్తున్నారు. ఇటీవల ఎన్‌టీఆర్ కారు తర్వాత, బన్నీ, కళ్యాణ్ రామ్ కార్లలో రూల్స్‌కి విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ ఉన్నందుకు చలాన్ కొట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లో తనిఖీలు నిర్వహించి, ఇద్దరి కార్లకున్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి, చెరో 700 రూపాయల చలాన్‌ను సమర్పించారు.

మరో అప్ డేట్ విషయానికి వేస్తే.. నేడు మాస్ సినీ ప్రేక్షకులకు సంబరమైన రోజు. కేజీఎఫ్ ట్రైలర్ సా. 6.40కి విడుదల కాబోతోంది. ఎటువంటి అంచనాలు లేకుండానే మొదటి పార్ట్ అదరహో అనిపిస్తే, రెండో పార్ట్‌పై అత్యద్భుత అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో నేడు తెలుగు ట్రైలర్‌ని రామ్ చరణ్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు ధృవీకరించారు. నేడు రామ్ చరణ్ బర్త్‌డే కావడంతో కేజీఎఫ్ 2 ట్రైలర్‌కి తెలుగులో మరింత మైలేజ్ రానుంది.
#KGFChapter2TrailerDay 🔥 pic.twitter.com/1QO9siVjAK
— K.G.F (@KGFTheFilm) March 27, 2022
ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. గతంలో ట్రంప్ ప్రధానిగా ఉన్నప్పుడు నేను తల్చుకుంటే ట్రంప్‌ని కూడా కలవగలను అన్నాడు బండ్ల గణేశ్. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కలిసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ట్విట్టర్‌లో యోగితో దిగిన ఫొటో పెట్టి, రెండోసారి ముఖ్యమంత్రి అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నెటిజన్లైతే కామెంట్స్‌తో అదరగొడుతున్నారు. అబ్బో… బండ్లన్న జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పుతున్నాడే..అంటున్నారు.
Bandla Ganesh: ఉత్తరప్రదేశ్ సీఎంతో బండ్ల గణేష్ మంతనాలు.. నువ్వు సూపరన్న అంటున్న నెటిజన్ల#BandlaGanesh #YogiAdityanath #UttarPradesh https://t.co/t5HsRu796R
— TV9 Telugu (@TV9Telugu) March 27, 2022
ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. తాను ప్రాణాలతో బయటపడటానికి కారణమైన వారందరికీ నటుడు సాయిధరమ్‌తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న తర్వాత తొలిసారి ఓ వీడియోను విడుదల చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రిలో చేర్చిన సయ్యద్ అబ్దుల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మానవత్వం మిగిలే ఉందని అనడానికి సయ్యద్ నిదర్శనమని చెప్పుకొచ్చారు. తనకు మెరుగైన వైద్యం అందించిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బందికి రుణపడి ఉంటానని అన్నారు.