Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి మిస్టర్ పర్ఫెక్ట్ అని మంచి పేరు ఉంది. పైగా బాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో ఆమీర్ ఖాన్ కూడా టాప్ ప్లేస్ లో ఉంటాడు. సహజంగా అమీర్ తన సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తాడు. సినిమా కోసం ఎంత కష్టాన్నైనా పడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ముఖ్యంగా సినిమా క్వాలిటీ విషయంలో అద్భుతమైన పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.

అయితే, సినిమా కోసం ప్రాణం పెట్టే ఈ హీరో.. ‘సినీ పరిశ్రమకి స్వస్తి చెప్పాలనుకున్నాను. ఇక సినిమాల్లో నటించడం కానీ, నిర్మించడం కానీ చేయకూడదనుకున్నాను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదేమిటి ? అలా ఎలా మాట్లాడాడు ? అంటూ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. అమీర్ తాజాగా ఓ ఇంటర్య్వూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పై విధంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Also Read: RRR Movie: అక్కడ RRR సినిమాను చూసేందుకు ముఖం చాటేస్తున్న ప్రేక్షకులు..
ఆ కామెంట్స్ ఏమిటో అమీర్ ఖాన్ మాటల్లోనే.. ‘నాకు చాలాకాలం వరకూ నా పిల్లలకు అసలు ఏం కావాలో కూడా నాకు క్లారిటీ రాలేదు. ఓ దశలో నాకు అది అతి పెద్ద సమస్య అయ్యింది. పైగా ఈ విషయం నాకు అర్థమవ్వడానికి చాలా ఏళ్ళు పట్టింది. అర్ధం అయ్యాక, నా మీదే నాకు కోపం వచ్చింది. ఆ కోపం కారణంగానే నాకు సినిమాల మీద కూడా కోపం వచ్చింది. అసలు ఈ సినిమాలే కదా.. నాకు, నా కుటుంబానికి మధ్య గ్యాప్ రావడానికి కారణం అయ్యింది అని అనిపించింది.
అమీర్ ఇంకా మాట్లాడుతూ.. ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ.. ‘ఆ సమయంలోనే నేను ఇక సినీ పరిశ్రమకి స్వస్తి చెప్పాలనుకున్నాను. ఇక ఎట్టిపరిస్థితుల్లో మళ్ళీ నేను సినిమాల్లో నటించడం కానీ, నిర్మించడం కానీ చేయకూడదు అని బలంగా నిర్ణయించుకున్నాను. నా రిటైర్‌మెంట్ ను కూడా ప్రకటించాలనుకున్నాను. కానీ లాల్ సింగ్ చద్ధా సినిమా మార్కెటింగ్‌లో భాగంగా నేను చేస్తున్న జిమ్మిక్కుగా ప్రేక్షకులు భావిస్తారని అనిపించింది.

అందుకే, అప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా రిలీజ్ అవుతుంది. ఇక నా సినిమాల మధ్య సాధారణంగా 3, 4 ఏళ్లు విరామం ఉండేలా చూస్తాను. కాబట్టి లాల్ సింగ్ చద్దా తర్వాత, మరో 3, 4 సంవత్సరాలు నా నుంచి సినిమా రాదు. అలా నేను నిశ్శబ్దంగా సినిమాల నుంచి తప్పుకోవచ్చు కూడా ’ అంటూ అమీర్ ఖాన్ చెప్పడం ఆయన అభిమానులను షాక్ కి గురి చేసింది.
Also Read: Ram The Warriorr: జూన్ 14న ది వారియర్’.. ఎనర్జిటిక్ హీరోకి హిట్ వస్తోందా ?