RRR Special Show In AP Bhavan: ఆర్ఆర్ఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. రాజమౌళి మెస్మరైజింగ్ మ్యాజిక్‌తో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ క్రమంలో ఢిల్లీ ఏపీ భవన్ లో కూడా ఈ చిత్రాన్ని స్పెషల్ షోలు వేసుకొని మరీ చూస్తున్నారు. ఢిల్లీలో ఉండే తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు, వ్యాపారులు, ప్రముఖుల కోసం ఏపీ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో రోజుకు 3 షోలు వేస్తున్నారట. ఇది నిజంగా విశేషమే.

ఒక సినిమా కోసం ప్రముఖులు సైతం ఇలా ప్రత్యేక ఆసక్తి చూపించడం గొప్ప విషయమే. ఎలాగూ ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అందరూ హ్యాపీగానే ఉన్నారు. అయితే ఇద్దరు హీరోలు మటుకు చాలా లాస్ అయినట్టే కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఒక్కొక్కరికీ రూ. 50 కోట్లు దాకా ముట్టాయని సినీ వర్గాల టాక్. అదీ కొంత చేతికందినవి, మరికొంత కలెక్షన్లలో వాటా. అయితే ఈ 4 ఏళ్లలో ఇద్దరూ ఓ 4 సినిమాలు చేసేవారు.
ఒక్కో సినిమాకి రూ. 25 కోట్లు వేసుకున్నా రూ. 100 కోట్లు వచ్చేవి. ముఖ్యంగా తారక్‌కి చాలా లాస్. ఎందుకంటే..ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. పైగా ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించాడు. 2015లో వచ్చిన టెంపర్ సినిమా నుంచి నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవిందసమేత, ఆర్ఆర్ఆర్ సినిమాలతో వరుస హిట్‌లు సాధించాడు.
వీటిలో ఏ సినిమా కూడా అభిమానులను నిరాశపరచలేదు. మిగతా టాప్ హీరోల చివరి ఆరు సినిమాల్లో ఏదో ఒక ఫ్లాప్ ఉంది. కానీ ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే వరుస హిట్లు ఉన్నాయి. ఈ లెక్కన ఎన్టీఆర్ ఒక సినిమా కోసం నాలుగేళ్లు సమయాన్ని కేటాయించడం నిజంగా సాహసమే. అయితే.. ఎన్టీఆర్ అంత సాహసం చేస్తే.. రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిన స్థాయిలో ఎలివేషన్స్ ఇవ్వలేదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సినిమాలో మెయిన్ హీరో ఎన్టీఆరే అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ భారీ హిట్ అయ్యింది. మరి ఆ హిట్ ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ నటనా స్థాయి ఏమిటో నార్త్ ప్రేక్షకులకు కూడా బలంగా తెలిసొచ్చింది.
[…] […]