Tollywood Trending Updates: టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. నటి పూనమ్ కౌర్ తాజాగా ‘నాతి చరామి’ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సినీ పరిశ్రమలో స్టార్స్, యాక్టర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఒక మనిషిని నమ్మి అయిదేళ్లు ఒక్క మూవీకి కేటాయించడం గొప్ప. అంటూ చాలా చెప్పుకొచ్చింది.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే…ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి నిన్నేలే నిన్నేలే అనే ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ‘నిన్నేలే నిన్నేలే.. నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే’ అంటూ ఎంతో భావోద్వేగంతో ఈ సాంగ్ సాగుతుంది.

Also Read: Bheemla Nayak Collections: ‘పవన్’ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది !
ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ఫాలోవర్స్ దాదాపు 57 లక్షలు అంటే 5.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్టీఆర్‌ను ఇంత మంది ఫాలో అవుతున్నారు కానీ ఆయన మాత్రం ఇన్నేళ్లుగా కేవలం ఒకే ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నాడు. ఆయనెవరో తెలుసా.. దర్శక ధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్ కెరీర్ ఈ రోజు ఇంత స్థాయిలో ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం రాజమౌళి. అందుకే ట్విట్టర్‌లో కేవలం ఆయనొక్కడినే ఫాలో అవుతున్నాడు.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న KGF-2లో అమితాబ్ బచ్చన్ షోలేలోని ‘మెహబూబా.. మెహబూబా’ పాటను రీమేక్ చేశారు. ఈ ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. హీరో యశ్ సరసన నటించినట్లు సమాచారం.

Also Read: Ettara Jenda Song: ఎన్టీఆర్ స్టెప్స్ ముందు తేలిపోయిన చరణ్, అలియా !
[…] […]