Nayanthara Marriage: నయనతార పెళ్లి.. ఈ వార్త పై గత కొన్ని సంవత్సరాలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఐతే, ఆ పుకార్లను ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టకుండా మొత్తానికి నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది అంటూ తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది. నయన్ విఘ్నేశ్ ను రహస్యంగా పెళ్లి చేసుకుందట. తమిళనాడులోని ప్రముఖ ఆలయాన్ని విగ్నేష్ శివన్-నయన తార సందర్శించారు. అదే సమయంలో ఓ వీడియోలో నయనతార పాపిట కుంకుమ పెట్టుకుని కనిపించింది.

భారతీయ సంప్రదాయంలో పెళ్లి అయిన స్త్రీలు మాత్రమే పాపిట కుంకుమ పెట్టుకుంటారు. కాబట్టి, నయనతార పెళ్లి అయిపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, నయన్ పెళ్లి వ్యవహారం పై ఇప్పటివరకు మీడియా హడావుడి చేయడమే తప్ప.. నయనతార నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో ఆమె పెళ్లి నిజంగానే జరిగిందా ? లేక ఎప్పటిలాగే ఇది కూడా రూమర్ గానే ముగుస్తోందా అంటూ నెటిజన్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వారి ఎదురుచూపులకు నయనతార క్లారిటీ ఇస్తే బాగుంటుంది. కాకపోతే, గతంలో నయనతార ‘స్టార్ విజయ్ టెలివిజన్’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆమె చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ, నయనతార.. తన పెళ్లి గురించి ఏమి మాట్లాడింది అంటే.. తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించి.. ఇది నా నిశ్చితార్థం రింగే. పెళ్లి కుమారుడు విగ్నేష్ శివనే.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !
మా నిశ్చితార్థానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అందుకే ఇండస్ట్రీలో కూడా ఎవరికీ మా నిశ్చితార్థం గురించి తెలియదు. నిశ్చితార్ధానికి ఎవర్ని పిలవకపోవడానికి కారణం.. నాకు సంబరాలు చేసుకోవడం, పెద్దగా హడావిడి చేయడం లాంటివి ఇష్టం ఉండవు. అందుకే మా నిశ్చితార్థ వేడుకను సింపుల్ గా జరువుకున్నాం. ఇక పెళ్ళి కూడా అలాగే చేసుకుంటాం ఏమో’ అంటూ చెప్పుకొచ్చింది నయనతార.
ఏది ఏమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. సినిమాలతో పాటు.. బిజినెస్‌లోనూ దుమ్మురేపుతోంది. అన్నట్టు ఈ బ్యూటీ ఒక ఆయిల్ కంపెనీలో దాదాపుగా రూ.100కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆలాగే నయనతార, విఘ్నేశ్ శివన్ కలిసి ఇప్పటికే రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు.
Also Read: అక్కడ చిరంజీవిని కలిసి ముచ్చట్లు పెట్టిన సల్మాన్ ఖాన్ !