Mahesh Babu: డైరెక్టర్ రాజమౌళికి మీడియా మిత్రులతో ఎప్పుడు ఎదురయ్యే ప్రశ్న మహేష్ బాబుతో ఎప్పుడు సినిమా తెరకెక్కనుంది అని. వాటన్నిటికీ చెక్ పెడుతున్నారు జక్కన్న. ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌లతో వంటి హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 7న విడుదల చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా విడుదల
తర్వాత ఆయన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో తెరకెక్కనుంది.
అయితే మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాను కూడా మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చిత్రాన్ని హాలీవుడ్ మూవీ టైప్ లో ఇండియా జోన్స్ తరహాలో తెరకెక్కించే ఉద్దేశంలో ఉన్నట్లు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ జానర్ మహేష్ బాబు కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట ఈ తండ్రి కొడుకులు . ఈ ప్రాజెక్టు లో మహేష్ బాబుతో పాటు మరో స్టార్ హీరో కూడా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జక్కన్న చిత్రాలంటే భారీ సెట్లు, గ్రాఫిక్స్ తో కూడుకున్న పని… అలానే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే మహేష్ బాబుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ అవసరం కాబట్టి… నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి.