Tollywood Hit Movies: దాదాపు చాలా సినిమాలు రెండు గంటలు లేకపోతే రెండు గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంటాయి. కానీ కథ డిమాండ్ చేసినప్పుడు కొంత మంది దర్శకులకు ఆ నిడివి పెంచక తప్పదు. ఇంత నిడివి తో సినిమా చేయాలి అంతే దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కథ యవరేజ్ గా ఉన్న రెండు గంటలు సినిమా అయితే ప్రేక్షకులను ఎలా గల ఎంటర్టైన్ చేయొచ్చు. కానీ మూడు గంటలసేపు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అది కత్తి మీద సానే. ఎందుకంటే మూడు గంటల సినిమాలో ఒక రెండు సీన్లు అవసరం లేనివి ఉన్నా కానీ, ఆ ప్రభావం సినిమా అంతటి పైన ఉంటది. మరి అంతటి భారీ నిడివి తో వచ్చి కూడా మన టాలీవుడ్ లో సూపర్ హిట్ సాదించిన సినిమా లేవో చూద్దాం…
సీత రామం
ఈమధ్య వచ్చిన సినిమాలలో క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఏది అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు సీత రామం. దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్, రష్మిక మందాన హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దాదాపు రెండు గంటల 45 నిమిషాలు ఉంటే ఈ చిత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా తీయడంలో దర్శకుడు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.
విక్రమ్
ఇటీవల విడుదల అయి తమిళంతో పాటు తెలుగులో కూడా సెన్సేషనల్ విజయం సాధించిన చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజన్.. కమల్ తో చేసిన ‘విక్రమ్’ చిత్రం రన్ టైం కూడా పెద్దదే. ఏకంగా 2 గంటల 53 నిమిషాలు మనల్ని థియేటర్లలో కూర్చోబెట్టాడు. అంతేకాదు మొదటిరోజు నుంచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా ప్రస్తుతం దూసుకుపోతోంది ఈ సినిమా.
పుష్ప
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఈ చిత్రం రన్ టైం 2 గంటల 59 నిమిషాలు ఉంటుంది.మొదటి రోజు డివైడ్ టాక్ రావడానికి అదే కారణం. ఫైనల్ గా మూవీ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది.
బాహుబలి 1…. బాహుబలి 2
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ రెండు చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సినిమాల్లో అతి ముఖ్యమైనది బాహుబలి. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ , సెకండ్ పార్ట్ రెండూ కూడా దాదాపు 3 గంటల సేపు ఉంటాయి. కానీ ఎక్కడా ఈ సినిమా అంత పెద్ద సినిమా అని మనకి అనిపించకపోవడం దర్శకుడి ప్రతిభ మనకి తెలియజేస్తుంది.
మహానటి
2 గంటల 57 నిమిషాలు నిడివి తో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం అలనాటి మహానటి సావిత్రి గారి జీవితచరిత్ర. అయితే ఆమె జీవితం మొత్తాన్ని కళ్ళకు కట్టినట్టు దర్శకుడు అద్భుతంగా చూపించారు. ఈ సినిమా నిడివి మూడు గంటలు ఉన్నా కానీ కేవలం ఒకటి అంటే ఒక్క సీన్ కూడా ఎక్కడా బోర్ కొట్టక పోవడం గమనార్హం.
ఆర్ఆర్ఆర్
రాజమౌళి- ఎన్టీఆర్- రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ రన్ టైం 3 గంటల 7 నిమిషాలు. కానీ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.