Telugu Bigg Boss 9 updates: ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్(Bigg Boss Telugu) సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఈ రియాలిటీ షో కి ఉన్నంత క్రేజ్ మరో రియాలిటీ షో కి లేదు, భవిష్యత్తులో కూడా రాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు,హిందీ,కన్నడ, మలయాళం మరియు తమిళం ఇలా అన్ని భాషల్లోనూ సెన్సేషనల్ హిట్ గా నిల్చింది ఈ సినిమా. తెలుగు లో 8 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, 9వ సీజన్ ని సెప్టెంబర్ నెలలో ప్రారంభించనున్నారు. ఈ సీజన్ కి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో సామాన్యులకు అవకాశం కల్పిస్తూ ఆసక్తి ఉన్నవాళ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తెలుగు బిగ్ బాస్ లాగానే హిందీ బిగ్ బాస్ లో కూడా ప్రతీ ఏడాది సరికొత్త ఆలోచనలు చేస్తూ ఉంటుంది టీం.
Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీ లో విలన్ గా రష్మిక..? ఆమె లుక్ ఎలా ఉండబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గత సీజన్ లో గాడిదని కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపి సంచలనం సృష్టించారు. ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ని లోపలకు పంపబోతున్నారట. మనుషులకంటే పది రెట్లు వేగంగా పనిచేయగల ఈ రోబో లోపలకు వెళ్లిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురు అవుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన 18 సీజన్స్ ఒక లెవెల్ అయితే, త్వరలో టెలికాస్ట్ అవ్వబోయే 19 వ సీజన్ మరో లెవెల్ అనొచ్చు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా మనకు బాగా తెలిసిన ఇద్దరు ప్రముఖ నటులు వెళ్ళబోతున్నారని టాక్. అందులో ఒకరు ఆశిష్ విద్యార్థి. తెలుగు, హిందీ,తమిళం ఇలా అన్ని ప్రాంతీయ భాషల్లో విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్నాడు ఈయన.
Also Read: నా ముద్దు సీన్ తీసేస్తారా.. హీరోయిన్ ఆగ్రహం
ఆశిష్ విద్యార్థి అంటే తెలియని వారుండరు. ప్రస్తుతం ఆయన స్టార్ మా ఛానల్ లో ‘కుకూ విత్ జాతి రత్నాలు’ అనే కార్యక్రమం లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమాల పరంగా ఒకప్పుడు ఉన్నంత బిజీ గా లేడు అనేది వాస్తవం. ఆశిష్ విద్యార్థి(Aasish Vidyardi) తర్వాత మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించిన హీరోయిన్ ‘అనిత'(Heroine Anitha) కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తుందట. తెలుగు లో ఈమె హీరోయిన్ గా నటించిన ‘నువ్వు నేను’ అనే చిత్రం అప్పట్లో ఎంతటి సెన్సేషనల్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసింది. ఇక హిందీ లో అయితే ఈమె టీవీ సీరియల్స్ లో పాపులర్ లేడీ విలన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతుంది. ఆడియన్స్ ని ఎంత మేరకు అలరిస్తుందో చూడాలి.