Junior Movie Trailer: చాలామంది యంగ్ హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నార. ఇక ఇలాంటి క్రమంలోనే కొత్త హీరోలు సైతం చాలామంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చూపించుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే గాలి జనార్దన్ రెడ్డి కొడుకు అయిన కిరీటి రెడ్డి (Kiriti Reddy) కూడా జూనియర్ (Juniour) సినిమాతో ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు…ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ వైరల్ వయ్యారి’ (Viral Vaiyyari) అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ అయితే పెరిగింది. అలాగే కిరిటి రెడ్డి డ్యాన్స్ మూమెంట్స్ కూడా అద్భుతంగా చేస్తూ ఉండడంతో అతని మీద ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే నిన్న ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. 2 గంటల 16 నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుందనే చెప్పాలి. ముఖ్యంగా లేటు వయసులో తల్లి అయిన హీరో తల్లి గురించి అందరు సూటి పోటి మాటలతో ఆమెను ఇబ్బంది పెడుతూ ఎమోషన్స్ ను ట్రైలర్ లో పొందుపరిచారు. ముఖ్యంగా ఈ ఎమోషన్ ని హైలైట్ చేస్తూ సినిమాలో కొంతవరకు కొన్ని సీన్లు అయితే ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నట్టుగా తెలుస్తోంది.అలాగే హీరో వాళ్ల తండ్రి చూపించే ప్రేమ వల్ల హీరో కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా లేటు వయసులో కొడుకు పుట్టినందువల్ల తండ్రి కొడుకు మీద ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాడు.
తండ్రిగా కన్నడ నటుడు రవిచంద్రన్ నటించడం ఈ సినిమాకి భారీగా ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…ఒక శ్రీలీల కూడా ఈ మూవీ కి బాగా హాప్ తీసుకువస్తుంది… అలాగే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా బాగా వినిపిస్తుంది…అయితే హీరో తండ్రి ప్రేమకు దూరంగా బతకాలనుకునే కుర్రాడు… జాబ్ లో ఎలాంటి గ్రోత్ ను సంపాదించాడు. తన తండ్రి నుంచి ఎలా తనను తాను దూరం చేసుకొని లైఫ్ ను లీడ్ చేయడం స్టార్ట్ చేశాడు.
Also Read: శ్రీలీలను నలిపేశాడు.. ఏం అదృష్టం రా బై నీది!
తన తండ్రి గొప్పతనం ఏంటి కుర్రాడు అతని తండ్రి నుంచి ఏం కోల్పోయాడు అనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశంగా తెరకెక్కినట్టుగా చూపించారు. ఇక ఈ సినిమాలో లవ్ సీన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ట్రైలర్ ను బట్టి చూస్తే జెనీలియా కూడా ఇందులో ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసినప్పటికి యాక్టింగ్ మీద కొంతవరకు కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే వస్తున్నాయి. మరి మొదటి సినిమా కావడం వల్ల ఆయన ఇంకా ఆ క్యారెక్టర్ తో జల్ కానట్టుగా కనిపిస్తోంది. ఇక హీరో లుక్స్ కూడా కొన్ని యాంగిల్స్ నుంచి అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. మొత్తానికైతే ట్రైలర్ మీద ప్రేక్షకుల్లో మంచి ఒపీనియన్ వచ్చినప్పటికి సినిమా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది…