Telangana Media Scandal: ఆయన సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్నారు. అనేక స్థాయిల నుంచి బ్యూరో దాకా వచ్చారు. ఎన్నో మానవీయ కథనాలు రాశారు. ఎన్నో సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతోమందిని ప్రభావితం చేశారు. అందువల్లే ఆయన ఒక గౌరవనీయమైన వ్యక్తిగా ఎదిగారు. తన వృత్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి బ్యూరో చీఫ్ అనే హోదాను పొందారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మరో ఆరు నెలల్లో పదవి విరమణ చేస్తారు అనుకుంటుండగా.. ఆయన అవినీతి ముద్ర వేసుకున్నారు. దీంతో నిన్నటిదాకా నమస్తే సార్ అని పిలిచిన వాళ్ళు ఇప్పుడు పురుగును చూసినట్టు చూస్తున్నారు. నిన్నటిదాకా గౌరవంగా చూసిన మేనేజ్మెంట్ పనిష్మెంట్ ఇచ్చింది. హెడ్ ఆఫీస్ లో పనిచేయాలని.. ఉన్నఫలంగా జిల్లా కార్యాలయం నుంచి వైదొలగాలని సూచించింది. దీంతో గత్యంతరం లేక ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. హెడ్ ఆఫీస్ వెళ్లాలని ఆలోచన కూడా విరమించుకున్నారు.
Also Read: సాక్షి బ్యాన్: మీడియాకు స్వేచ్ఛ, హక్కులు కావాలట..
ఆ పత్రిక అధిపతి సొంత జిల్లాలో ఆ బ్యూరో చీఫ్ పనిచేస్తున్నారు. ఇటీవల ఓ నియోజకవర్గానికి సంబంధించిన విలేకరి విషయంలో వసూళ్ల పర్వం సాగింది. ఇందులో అక్కడ ఎడిషన్ ఇంచార్జి పేరు కూడా వినిపించింది. అయితే ఆ విలేకరి తనను విధిస్తున్నారంటూ అతడు సోషల్ మీడియాకు ఎక్కాడు. స్వీయ వీడియో తీసుకొని తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనను వేధిస్తున్నారని.. ఇబ్బంది పెడుతున్నారని.. నరకం చూపిస్తున్నారని వాపోయాడు. దీంతో ఆ వీడియో ఎవరి దగ్గరికి వెళ్లాలో వారి దగ్గరికి వెళ్లింది. అసలే ఈ పత్రిక అధిపతి పై తీవ్రమైన మంటతో ఉన్నవారు ఆ వీడియోను మరింత ట్రోల్ చేశారు. దీంతో ఆ పత్రిక యజమాని తలవంపులకు గురికావాల్సి వచ్చింది. మరో మాటకు తావు లేకుండా త విచారణకు ఆదేశించారు. విచారణలో ఏం తేలిందో తెలియదు.. ఏం జరిగిందో తెలియదు. బ్యూరో ఇన్చార్జి ని పత్రిక ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఒక నామమాత్రమైన పోస్ట్ కేటాయించారు. ఎడిషన్ ఇంచార్జి ను మరో జిల్లా కేంద్రానికి ఉపసంపాదకుడిగా బదిలీ చేశారు. ఆ ఎడిషన్ ఇంచార్జి కూడా అక్కడికి వెళ్లే అవకాశం లేదు. మొత్తానికి ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇటు బ్యూరో ఇన్చార్జి కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read: నా ముద్దు సీన్ తీసేస్తారా.. హీరోయిన్ ఆగ్రహం
వాస్తవానికి ఆ బ్యూరో ఇంచార్జికి సుదీర్ఘమైన అనుభవం ఉంది. మరికొద్ది రోజుల్లో ఆయన పదవి విరమణకు సిద్ధంగా ఉన్నారు. పదవి విరమణ నాటికి స్వచ్ఛమైన కెరియర్ సాగించాననే ఆనందంతో వృత్తికి ముగింపు పలకాల్సిన ఆయన.. అవినీతి మరకతో ఆరు నెలల ముందుగానే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది.. అంతేకాదు అనేక ఆరోపణలు వినాల్సి వచ్చింది. అందుకే పాత్రికేయులు తమ పరిధిలో ఉండాలి. మేనేజ్మెంట్ ఎలా అయినా వాడుకుంటుంది. ఉద్యోగాన్ని భద్రంగా ఉంచుకోవడానికి.. ఉద్యోగంలో భద్రంగా ఉండడానికి కచ్చితంగా మేనేజ్మెంట్ లైన్ కు అనుకూలంగానే పనిచేయాల్సి ఉంటుంది. అలాకాకుండా ఇష్టాను సారంగా వ్యవహరిస్తే ఇదిగో ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి ఈ బ్యూరో ఇన్చార్జి వ్యవహారమే ఒక బలమైన ఉదాహరణ.