https://oktelugu.com/

Bollywood: బాలీవుడ్ లో టాప్ 6 హీరోల ప్లేస్ ను ఆక్రమిస్తున్న మన స్టార్ హీరోలు…

బాలీవుడ్ హీరోల సినిమాలేవి అక్కడ ఆడక పోగా ఇప్పుడు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్లు సినిమాలు చేస్తు కనీసం సక్సెస్ లు అయిన సాధించాలని చూస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 11, 2024 / 04:16 PM IST

    Tollywood star heroes occupying top 6 heroes places in Bollywood

    Follow us on

    Bollywood: ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనేంత లా మనవాళ్లు పాన్ ఇండియాలో చెరగని ముద్ర వేస్తున్నారు. ఇక ఇప్పటికే మన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా సినిమాలని చేస్తూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఇక ఇప్పటికే బాలీవుడ్ హీరోల సినిమాలేవి అక్కడ ఆడక పోగా ఇప్పుడు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్లు సినిమాలు చేస్తు కనీసం సక్సెస్ లు అయిన సాధించాలని చూస్తున్నారు. కానీ అవి కూడా వాళ్ళకి దక్కడం లేదు. ఇక దానివల్ల బాలీవుడ్ ప్రేక్షకులందరూ కూడా మన తెలుగు సినిమాలనే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. మన స్టార్ హీరోలకి పట్టం కడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో అక్కడున్న ఆరుగురు స్టార్ హీరోల ప్లేస్ ను కబ్జా చేయడానికి మన ఆరుగురు స్టార్ హీరోలు రెడీగా ఉన్నారు.

    ఇక బాలీవుడ్ హీరోలు అయిన అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్బీర్ కపూర్ లాంటి హీరోల ప్లేస్ ని రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు రాబోయే రెండు సంవత్సరాల్లో ఆక్రమించేసి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే, ఇండియన్ స్టార్ హీరోలు అంటే తెలుగులో ఉన్న ఈ ఆరుగురు స్టార్ హీరోలే అనేలా ఇండస్ట్రీని సరికొత్తగా మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికే మనవాళ్లు కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవడానికి బాలీవుడ్ ఇండస్ట్రీ నానా పాట్లు పడుతుంది. ఇక అమీర్ ఖాన్ లాంటి ‘మిస్టర్ పర్ఫెక్షనిస్టు’ అయిన స్టార్ హీరో సైతం మన వాళ్ళని ఎదుర్కోవాలంటే ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. ఇక ఆయన చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పటివరకు ఆయన మరొక సినిమా అయితే కమిట్ అవ్వలేదు. ఇక ఈ సినిమా రిలీజ్ అయి సంవత్సరం దాటినప్పటికీ ఆయన ఇంకో సినిమా అయితే కమిట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు ఆయన మీద పలు రకాల కామెంట్లైతే వస్తున్నాయి…