Vizianagaram: రోడ్డుపై దొరికిన బ్యాగ్.. ఆ యువకుడు చేసిన పనికి అంతా ఫిదా

ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాం జిల్లా ఉంది. కల్లికోట బ్లాక్ లోని మధురకు చెందిన సూరజ్ కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల కిందట ఆయన బైక్ పై సొంత ఊరు నుంచి నిర్మలఝర్ కి వెళుతున్నాడు.

Written By: Dharma, Updated On : May 11, 2024 4:11 pm

Vizianagaram

Follow us on

Vizianagaram: రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదో ఒక వస్తువు దొరక్కపోతుందా అని ఆలోచించేవారు ఉంటారు. అలా దొరికిన వాటిని నిజాయితీగా బాధితులకు అందజేసిన వారు కొందరే ఉంటారు. దొరికింది కదా మనమే తీసుకుందామని చాలామంది స్వార్థంతో ఆలోచిస్తుంటారు. అటువంటిది రోడ్డుపై వెళ్తుండగా.. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగు కనిపించింది. దానిని తెరిచి చూడగా షాకింగ్ పరిణామం ఎదురైందిఆ యువకుడికి.

ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాం జిల్లా ఉంది. కల్లికోట బ్లాక్ లోని మధురకు చెందిన సూరజ్ కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల కిందట ఆయన బైక్ పై సొంత ఊరు నుంచి నిర్మలఝర్ కి వెళుతున్నాడు. దారిలో ఓ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన ఒక బ్యాగ్ అనుమానాస్పదంగా పడి ఉంది. అతడు బైక్ ఆపి వెళ్లి ఆ బ్యాగును ఓపెన్ చేశాడు. అందులో డబ్బులతో పాటు కొన్ని మందులు, విలువైన డాక్యుమెంట్స్ కనిపించాయి. వెంటనే ఆ యువకుడు కల్లి కోట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి బ్యాగు పూర్తిగా తెరవగా అందులో 90 వేల రూపాయల నగదు బయటపడింది. డాక్యుమెంట్ల ఆధారంగా ఆ బ్యాగు ఏపీలోని విజయనగరం చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ దిగా తేలింది.

ఎక్కడైనా చిన్నపాటి వస్తువు దొరికితే ఉంచుకునే రోజులు ఇవి. రోడ్డుపై పది రూపాయలు దొరికితే చాలు సంతృప్తిగా తీసుకునే రోజులువి. అటువంటిది సుమారు లక్షలు విలువైన బ్యాగు దొరికినా.. నిజాయితీతో పోలీసులకు అప్పగించిన సూరజ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులతోపాటు స్థానికులు అభినందిస్తున్నారు. ఎదుటివారిని ఏమార్చి దోచుకున్న ఈ రోజుల్లో.. నిజాయితీగా డబ్బులు తిరిగి అప్పగించినందుకు యువకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.