https://oktelugu.com/

Vijay Deverakonda: సల్మాన్ ఖాన్ తో పోటీ కి సిద్ధం అయిన టాలీవుడ్ స్టార్ హీరో…

హీరోల మధ్య పోటీ లేకపోయినా వాళ్ళు నటించిన సినిమాలా మధ్య మాత్రం ఎప్పుడు పోటీ ఉంటుంది. నిజానికి వాళ్ళు చేసే సినిమాలు వాళ్ళను ఉన్నత స్థాయి లో నిలబెడతాయి...

Written By:
  • Gopi
  • , Updated On : August 4, 2024 / 12:25 PM IST

    Vijay Deverakonda

    Follow us on

    Vijay Deverakonda: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ అనేది తరచుగా ఉంటుంది. ఇలాంటి క్రమం లోనే ఎవరికి వారు వాళ్ళ సినిమాకి భారీ కలెక్షన్లు రావాలనే ఉద్దేశ్యం తో ఎక్కువగా పండుగ సీజన్ల ను టార్గెట్ చేస్తూ ముందుకు వస్తారు. కాబట్టి స్టార్ హీరోల మధ్య పోటీ అనేది సర్వ సాధారణం అనే చెప్పాలి. కానీ తెలుగులో రౌడీ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో ప్రస్తుతం బాలీవుడ్ హీరోలతో సైతం తమ సినిమాని పోటీకి దింపుతుండడం అనేది నిజంగా ఒక రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి ఏ విధంగా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక వివరాల్లోకి వెళితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ‘VD 12’ అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందనే చెప్పాలి. ఎందుకంటే ఈమధ్య విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న ఏ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని అలరించడం లేదు. దానితో పాటుగా ఆయనకు కొంచెం ఓవర్ ఆటిట్యూడ్ కూడా ఉందనే పేరు జనాల్లో బాగా నాటుకుపోయింది. ఇక ఇప్పుడు తను పర్సనల్ గా మంచివాడు అని ప్రూవ్ చేసుకుంటూనే సినిమాల పరంగా కూడా భారీ సక్సెస్ లను అందుకోవాలి. అలా చేస్తేనే తను స్టార్ హీరోల రేంజ్ కి వెళ్తాడు. లేకపోతే మాత్రం ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరో గానే కొనసాగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న VD 12 మూవీ ని మార్చి 28 2025వ సంవత్సరంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అందుకోసమే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం ‘ఈద్ ‘ పండుగను టార్గెట్ చేసుకొని సల్మాన్ ఖాన్ ఒక సినిమాని రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ సంవత్సరం ఈద్ కి కూడా సికిందర్ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మార్చి 30వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి.

    ఇక మురుగదాస్ డైరెక్షన్ లోచేస్తున్న ఈ సినిమా మీద బాలీవుడ్ లో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క సక్సెస్ కూడా లేకుండా వరుస ఫ్లాప్ లను అందుకుంటున్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడు అని అతని అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ సల్మాన్ ఖాన్ ఇద్దరు రెండు రోజుల గ్యాప్ లోనే బాక్సాఫీస్ వద్ద పోటీ సిద్ధం అవుతున్నారు. కాబట్టి వీళ్లలో ఎవరు పై చేయి సాధిస్తారనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక విజయ్ దేవరకొండ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న క్రమంలో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి భారీ క్రేజ్ దక్కుతుందనే ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు…

    ఇక ఇప్పటికే గత సంవత్సరం షారుఖ్ ఖాన్ నటించిన ‘ డంకి’ అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సలార్ ‘ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా డంకి డిజాస్టర్ అయితే సలార్ సినిమా భారీ సక్సెస్ ని అందుకొని 800 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక బాలీవుడ్ తో పోటీ పడిన టాలీవుడ్ సినిమా భారీ సక్సెస్ సాధించడం అనేది నిజంగా ఒక గొప్ప రికార్డు అనే చెప్పాలి. మరి ఈ సక్సెస్ ల పరంపరం ను కొనసాగిస్తూ మరోసారి విజయ్ దేవరకొండ బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ ను బీట్ చేసి సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…