https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ తో సినిమా చేయాలనుకొని చివరి నిమిషం లో మిస్ చేసుకున్న డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ల డైరెక్షన్ లో చాలామంది హీరోలు నటించి మంచి పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలాంటి డైరెక్టర్లు కూడా ఒకానొక సందర్భంలో ఫ్లాప్ సినిమాలను తీయాల్సి వస్తుంది. ఇక దానికి కారణాలు ఏంటి అనే విషయం పక్కన పెడితే, మనం తీసిన అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలనే రూల్ ఏమి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : August 4, 2024 / 12:29 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ భారీ క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక అందులో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చేసిన ఒకటి రెండు సినిమాలు ప్లాప్ లను మూట గట్టుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమాతో మాత్రం హీరో గా గుర్తింపు పొందడమే కాకుండా యంగ్ రెబల్ స్టార్ గా తనను తాను రిప్రజెంట్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెను తిరిగి చూడకుండా సక్సెస్ లను సాధిస్తూ ప్రస్తుతం పాన్ ఇండియాలో తనను మించిన స్టార్ హీరో మరొకరు లేరు అనేంతలా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు ఆయన లైన్ లో ఉన్నప్పటికీ మరికొన్ని సినిమాలను కూడా చేసే ఆలోచనలతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హీరాని బాహుబలి సినిమాను చూసి ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడట. ఇక అందులో భాగంగానే ప్రభాస్ కి ఒక కథను కూడా వినిపించారట. కానీ అది చాలా సాఫ్ట్ గా ఉండడం అలాగే ప్రభాస్ అందులో తనను తాను ఊహించుకోలేకపోవడం తో దానిని రిజెక్ట్ చేసి వేరే ఏదైనా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా స్టోరీ ఉంటే చేద్దామని చెప్పారట. దానికి రాజ్ కుమార్ హీరాని ఒకే అని చెప్పారట.

    rajkumar hirani

    నిజానికి ఈ దర్శకుడు కంటెంట్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తెరకెక్కించడం చాలా కష్టమనే చెప్పాలి. అలా వీళ్ళ కాంబినేషన్ లో రావాల్సిన ఒక సినిమా మిస్ అయిందనే చెప్పాలి. ఇక రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాకు సంభందించిన ట్రైయిల్స్ లో ఉన్నాడు.

    ఇక ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకొని ప్రభాస్ కోసం ఒక యాక్షన్ సబ్జెక్ట్ ని రెడీ చేసి సినిమా చేస్తాడా లేదంటే తనకు అవలేబుల్ గా ఉన్న హీరోలతోనే సినిమాలు చేసి సక్సెస్ లను అందుకుంటాడా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈయన కెరియర్ లో చేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, సంజు లాంటి సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. ఇక బాహుబలి ముందు వరకు కూడా ఈయన నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగాడు…

    ఇక ఇలాంటి డైరెక్టర్ కూడా ప్రభాస్ తో సినిమా చేయాలని ఉత్సాహాన్ని చూపించడం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ప్రస్తుతం తెలుగు హీరోలు డైరెక్టర్ల మీదనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఆధారపడి ఉందనేది వాస్తవం… ఇక డంకీ సినిమాతో ఒక భారీ ఫ్లాప్ ని అందుకున్న రాజ్ కుమార్ హిరానీ తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తున్నాడు అనేది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు…