Star Anchor: బుల్లితెర మీద యాంకరింగ్ తో ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అందాల యాంకరమ్మ చేస్తున్న టీవీ షోస్ బుల్లితెర పైన టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. తన యాంకరింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంటుంది. ఒకవైపు బుల్లితెర మీద యాంకరింగ్ తో అదరగొడుతూ నే మరోవైపు అవకాశం వస్తే సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఫోటోషూట్స్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అందాల తార చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో తన తండ్రి చేతిలో ఉన్న ఈ చిన్నారి తెలుగులో టాప్ యాంకర్ గా రాణిస్తుంది.
Also Read: ఆకట్టుకుంటున్న ‘సింగిల్’ థియేట్రికల్ ట్రైలర్..మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసిన శ్రీవిష్ణు!
ఈమె మరెవరో కాదు యాంకర్ శ్రీముఖి. శ్రీముఖి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అందంతో, మాటల గారడీతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై రాములమ్మగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీముఖి తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ప్రముఖ ఛానల్ ఈటీవీ లో ప్రసారమయ్యే అదుర్స్ అనే డాన్స్ షో ద్వారా శ్రీముఖి యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా నటించింది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది శ్రీముఖి.
View this post on Instagram
ఓవైపు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో అలరిస్తూనే మరోవైపు బుల్లితెర మీద కూడా యాంకర్ గా తన సత్తా చాటుతుంది. ముఖ్యంగా శ్రీముఖి పటాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే శ్రీముఖి చాలా కాలం నుంచి సినిమాలలో కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై పలు షోస్ తో బిజీగా గడుపుతుంది. యాంకర్ గా బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ పెడుతూ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది శ్రీముఖి. ప్రస్తుతం బుల్లితెర మీద అత్యధిక పారితోషకం తీసుకుంటున్న యాంకర్లలో ఈమె కూడా ఒకరు. యాంకర్ శ్రీముఖికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.
Also Read: పెళ్లయిన స్టార్ హీరోతో ఎఫైర్ నడిపి కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్…