Senior Heroes : సినిమా ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్స్ అన్ని రాత్రిపూట జరుగుతూ ఉంటాయి. ఇక ఆయా సినిమాలకు కొంతమంది స్టార్ హీరోలు గెస్టులుగా వస్తే తమ సినిమాకి రీచ్ పెరుగుతుంది. ప్రమోషన్స్ ఎక్కువగా జరుగుతాయనే ఉద్దేశ్యంతో ఆ నిర్మాతలు స్టార్ హీరోలను గాని, సీనియర్ హీరోలను గాని, చీఫ్ గెస్టులుగా పిలుస్తూ ఉంటారు. సీనియర్ హీరోలైతే స్టేజ్ మీద మైక్ పట్టుకోగానే తమ గురించి గొప్పలు చెప్పుకోవాలనే ఉద్దేశ్యంతో లేనిపోని హంగులు ఆర్భాటాలను సంతరించుకొని వాళ్ళను వాళ్ళు హైలెట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సీనియర్ హీరోలు అయితే ఈవెంట్ కి వచ్చే ముందే ఒక రెండు పెగ్గుల మందు వేసి వస్తారు అనే విషయం చాలామంది విషయంలో స్పష్టంగా తెలిసిపోయింది. రాజేంద్రప్రసాద్ లాంటి నటుడు సినిమాల పరంగా మంచి నటుడు. ప్రేక్షకుల్లో ఆయనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అయినప్పటికీ ఆయన స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. గతంలో రాబిన్ హుడ్ (Rabin hud) సినిమా ఈవెంట్లో డేవిడ్ వార్నర్ గురించి చాలా చులకనగా మాట్లాడుతూ నెటిజన్ల దృష్టిలో చాలా బ్యాడ్ అయ్యాడు. మొత్తానికైతే డేవిడ్ వార్నర్ కి సారీ చెప్పి ఆ ఇష్యుని సద్దుమణిగేలా చేశాడు. ఇక రీసెంట్ గా ఒక ఈవెంట్ కి వచ్చిన ఆయన కొంచెం ఊగుతూ, కొంచెం తడబడుతూ మాట్లాడాడు. ఇక దానికి తగ్గట్టుగానే కమెడియన్ అలీని ఉద్దేశిస్తూ కొన్ని బూతులు కూడా మాట్లాడాడు…
మొత్తానికైతే సీనియర్ నటులకు ఏజ్ పెరగడంతో చాదస్తం ఎక్కువైపోతుంది. దానివల్ల మేమే గొప్ప నటులము..మమ్మల్ని మించినవారు ఎవరు లేరు అనే ఒక ధోరణిలో వాళ్లు ఉండి తమకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ఇతర నటుల మీద నోరు కూడా జారుతున్నారు.
దీనికంతటికి కారణం సినిమా ఈవెంట్లు నైట్ పూట జరుగుతుండటం దానివల్ల వాళ్ళు రెండు పెగ్గులు వేసుకొని రావడమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నైట్ మందు అలవాటు ఉండి తాగుతుంటే, మరి కొంతమంది మాత్రం స్టేజ్ ఫియర్ ఉండడంతో స్టేజి మీద మాట్లాడడానికి ఇబ్బందిపడుతారు దానివల్ల వాళ్ళు దైర్యం కోసం ఒక పెగ్గు వేసుకొని వస్తున్నారట…
అయితే మంది తాగడం లో తప్పులేదు కానీ స్టేజ్ మీద బూతులు మాట్లాడటం తప్పు….ఇక మీదట అయిన నటులు పబ్లిక్ ఫంక్షన్ కి వచ్చినప్పుడు వీటన్నింటిని కంట్రోల్ చేసుకుంటే పర్లేదు కానీ అవి శృతిమించితే మాత్రం వాళ్ల కెరియర్ ల్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే జనాల్లో వాళ్ల మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
