World Champion defeated by Gukesh : తెలుగోడి సత్తా మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఎగబాకింది. చెస్ క్రీడలో వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్ గా కొనసాగుతూ వచ్చిన మాగ్నస్ కార్ల్‌సన్(Magnus Karlson) ని మన తెలుగు తేజం దొమ్మరాజు గూకేష్(Dommaraju Gukesh) ఓడించడం సంచలనం గా మారింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఓటమి చెందడం తో అసహనంపై గురైన మాగ్నస్ కార్ల్‌సన్ బల్ల మీద గుద్దుతూ పైకి లేచి వెళ్ళిపోయాడు. మధ్యలో దొమ్మరాజు గూకేష్ కి ఎదో నామమాత్రంగా శుభాకాంక్షలు తెలియజేసాడు. గూకేష్ కూడా నామమాత్రంగానే స్పందించాడు.గెలిచిన వెంటనే గూకేష్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొత్తం ఒక సినిమాటిక్ అనుభూతిని కలిగించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదే సమయం లో మాగ్నస్ కార్ల్‌సన్ పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎంత పెద్ద వరల్డ్ ఛాంపియన్ అయినా ఎదో ఒక సమయంలో ఓడిపోవాల్సిందే. అంత మాత్రానా ఆ స్థాయి ఆవేశం పనికి రాదు, ఇది క్రీడా స్ఫూర్తి కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. బహుశా తాను వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్ అనే గర్వం అతనికి తార స్థాయిలో ఉన్నట్టుగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దొమ్మరాజు గూకేష్ ఆంధ్ర ప్రదేశ్ చెందిన వ్యక్తి అయ్యినప్పటికీ కూడా చెన్నై లోనే పుట్టి పెరిగాడు. అతని తల్లి పేరు పద్మకుమారి. ఈమె వృత్తి పరంగా మైక్రో బయోలాజిస్ట్. అదే విధంగా తండ్రి పేరు రజనీకాంత్. ఈయన ENT సర్జన్. 2013 వ సంవత్సరం లో తనకు 7 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు చెస్ గేమ్ ని నేర్చుకున్నాడు గుకేష్. అలా చెస్ గేమ్ పై మక్కువ పెరుగుతూ పోవడం తో నాల్గవ తరగతి కే చదువు మానేసి చెస్ క్రీడపైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. 2017 వ సంవత్సరం లో ఇతని తండ్రి రజనీకాంత్ రిటైర్మెంట్ తీసుకొని తన కొడుకుని ప్రపంచవ్యాప్తంగా జరిగే చెస్ టోర్నమెంట్స్ కి తీసుకెళ్ళేవాడు.
Also Read : కష్టపడి 11 కోట్లు సంపాదిస్తే..4.67 కోట్ల పన్ను కట్టాలా.. చెస్ ఛాంపియన్ గుకేష్ గుక్కపెట్టి ఏడవడమే తక్కువ..
అలా అండర్ 9 సెక్షన్ ఏషియన్ స్కూల్ చెస్ ఛాంపియన్ షిప్ లో గెలిచి మొదటిసారి మన తెలుగోడి సత్తా ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. అండర్ 12 క్యాటగిరీ లో జరిగిన అనేక టోర్నమెంట్స్ లో గుకేష్ ఏకంగా 5 గోల్డ్ మెడల్స్ ని సాధించి చరిత్ర సృష్టించాడు. అలా ఎన్నో విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న గుకేష్ నార్వే లో జరుగుతున్న చెస్ టోర్నమెంట్ లో మాగ్నస్ కార్ల్ సన్ ని ఓడించడం సంచలనాత్మకంగా మారింది.
వరల్డ్ నెంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్
ఓటమి ఆవేదనతో చెస్ బోర్డ్‌ను బలంగా కొట్టి వెళ్ళిపోయిన మాగ్నస్ కార్ల్‌సన్ pic.twitter.com/lwSuFKVaFp
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2025