rakul taol
సుశాంత్ మృతితో సెన్సేషనల్ అయిన డ్రగ్స్ కేసు అటు బాలీవుడ్‌ను.. ఇటు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా అరెస్టు తర్వాత ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం ఎన్సీబీ అధికారులు ఒక్కొక్కరికి సమన్లు పంపించారు. ఒక్కొక్కరిని పిలిచి వేర్వేరుగా విచారిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా విచారణకు హాజరైంది.
రకుల్ రియా చక్రవర్తికి మంచి స్నేహితులరాలు. దీంతో నిత్యం వీరు వాట్సాప్‌లో చాట్ చేసుకునే వారు. ఈ చాట్స్‌ను ఆధారంగా చేసుకొని ఎన్సీబీ అధికారులకు ఈమె పేరు తెలిసింది. దీంతో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో ఉన్న రకుల్ ఆ పని పక్కనపెట్టి విచారణ హాజరైంది.
అయితే.. రకుల్‌ను ఎన్సీబీ అధికారులు విచారించడం స్టార్ట్ చేయడంతో ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. కొందరిలో గుబులు కూడా మొదలైంది. ఎక్కడ ఎవరి పేరు బయట పెడుతుందోనని ఆందోళన చెందుతున్నారట. టాలీవుడ్‌లోనూ సాధారణంగా డ్రగ్స్ వాడే వారి సంఖ్య భారీగానే ఉంది. ఇప్పటికే టాలీవుడ్‌నూ డ్రగ్స్ కేసు షేక్ చేసింది. కొత్తగా రకుల్ దొరకడంతో ఈ భయం వారిలో మళ్లీ మొదలైందని తెలుస్తోంది.
ఇప్పుడు బాలీవుడ్, కన్నడ చిత్ర రంగం అంటూ డ్రగ్స్ విచారణ నడుస్తున్నా.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పటినుంచో వెలుగులోకి వచ్చింది. ప్రముఖులు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే స్థానిక పలుకుబడి వాడుకుని అది సమసిపోయేలా చూసుకున్నారట. ఒకవేళ మన వాళ్ల పేర్లు ఇప్పుడు జాతీయ స్థాయిలో బయటకు వస్తే మాత్రం అంత తేలికగా బయట పడలేరు.