కొన్ని సందర్భాల్లో నిజం ఏంటో, అబద్ధం ఏంటో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పటివరకు వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా వైరస్ చైనాలోని జంతువుల ద్వారా ఆ దేశంలోకి వ్యాప్తి చెందిందని.. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిందని భావించారు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం కరోనా వైరస్ చైనా సృష్టి అనే విషయం సులభంగా అర్థమవుతుంది.
వైరస్ శరవేగంగా వ్యాప్తి చెంది అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న తరువాత ప్రపంచ దేశాలు కరోనా వైరస్ చైనా సృష్టే అనే వాదనను బలంగా వినిపిస్తున్నాయి. చైనా ఆధిపత్యం కోసం ఇలాంటి పన్నాగం పన్నిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చైనా కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ప్రపంచ దేశాలకు అప్పటివరకు తెలియని లాక్ డౌన్ ను పరిచయం చేసింది. లాక్ డౌన్ అమలు వల్ల ఏ దేశమైనా ఆర్థిక ఇబ్బందులు పడక తప్పదని చైనాకు బాగా తెలుసు.
ప్రపంచ దేశాలు సైతం కరోనా వైరస్ వ్యాప్తి చెందితే లాక్ డౌనే శరణ్యం అనే భావనను చైనా ఆ దేశాల అధ్యక్షుల్లో కలిగించింది. లాక్ డౌన్ అమలు చేయకపోతే మొదటికే మోసం వస్తుందని.. వైరస్ వేగంగా వ్యాప్తి చెంది వేల సంఖ్యలో ప్రజలు చనిపోయే అవకాశాలు ఉన్నట్టు చైనా సంకేతాలు ఇచ్చింది. అమెరికన్ లాయర్ మైఖేల్ సెంగల్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే కరోనా వైరస్ వెనుక ఏదో కుట్ర ఉందని సులువుగానే అర్థమవుతుంది.
చైనా తమ దేశంలో క్రూరమైన నిబంధనలను అమలు చేయడం ద్వారా కరోనాను కట్టడి చేయగలిగామని నమ్మించి ఇతర దేశాల విషయంలో కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్ ను మొదట అమలు చేసిన ఇటలీలో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందిందని.. చైనా ఫేక్ సోషల్ మీడియా ఖాతాల సహాయంతో తప్పుడు ప్రచారం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.