https://oktelugu.com/

Dil Raju: ట్రెండింగ్ లోకి ‘దిల్ రాజు’ భార్య.. ఆ పిక్ వల్లే !

Dil Raju: సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన దిల్ రాజు, నెంబర్ వన్ నిర్మాతగా టర్న్ అయి, ప్రస్తుతం థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకుని ఇండస్ట్రీని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాడు. పైగా, భవిష్యత్తులో పోటీ వచ్చే స్కోప్ ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ను కూడా శాసించే స్థాయికి వచ్చాడు. ఐతే, దిల్ రాజు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 19, 2022 / 07:12 PM IST
    Follow us on

    Dil Raju: సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన దిల్ రాజు, నెంబర్ వన్ నిర్మాతగా టర్న్ అయి, ప్రస్తుతం థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకుని ఇండస్ట్రీని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాడు. పైగా, భవిష్యత్తులో పోటీ వచ్చే స్కోప్ ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ను కూడా శాసించే స్థాయికి వచ్చాడు.

    Dil Raju

    ఐతే, దిల్ రాజు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుసుకుందాం. దిల్ రాజు మళ్లీ తండ్రి కాబోతున్నాడు. దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. కొన్నేళ్ల క్రితం అనిత హఠాత్తుగా మరణించారు. దాంతో, దిల్ రాజు.. లాక్ డౌన్ సమయంలో వైఘా రెడ్డి (తేజస్విని)ని రెండో పెళ్ళి చేసుకున్నారు.

    Also Read: Koratala Siva- NTR: ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా !

    కూతురు, పెద్దల సలహాతో వైఘా రెడ్డిని వివాహమాడారు. అయితే, ఈ దంపతులు త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తాజాగా బయటకొచ్చిన వైఘా రెడ్డి పిక్ లో ఆమె బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తోంది. దాంతో ఈ పిక్ తో పాటు ‘మళ్ళీ తండ్రి కాబోతున్న దిల్ రాజు’ అంటూ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

    అయితే ఇప్పటికే ఆయనకు ఒక కుమార్తె హర్షిత ఉన్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు దిల్ రాజు కి వారసుడు ఎవరూ లేరని ఆ ఇంట ఎంతో లోటుగా ఉండేది. మరి, ఈ సారి వారసుడు జన్మిస్తే ఇక ఆ ఇంట సంబరాలు అంబరాన్నంటుతాయి. ఎలాగూ దిల్ రాజు తనకు ఓ వారసుడు కావాలని ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్ గా చెప్పాడు. మరి ‘దిల్ రాజు’కి వారసుడు కలగాలని ఆశిద్దాం.

    Dil Raju

    ఇక దిల్ రాజు ఓ చిన్న సైజ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కంటెంట్ ఏజెన్సీ కూడా పెట్టబోతున్నాడు. అంటే ఎవరైనా అవుట్ ఫుట్ తో వస్తే.. దాన్ని మార్కెట్ చేసే సంస్థ అన్నమాట. ఓటీటీకి కంటెంట్ విక్రయించే పనితో పాటు కంటెంట్ ను తయారు చేసే విధంగా తన సంస్థను మార్చబోతున్నాడు.

    ఇప్పటికే దిల్ రాజుకు శాటిలైట్ హక్కుల కొనుగోలు, అమ్మకాల బిజినెస్ కూడా వుంది. ఇప్పుడు అలాగే ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏమైనా దిల్ రాజు మాత్రం ఇండస్ట్రీలో తనకున్న ఇమేజ్ ను నిలబెట్టుకోవడానికి బాగానే ప్రయత్నం చేస్తోన్నాడు.

    Also Read:Victory Venkatesh Son:విక్టరీ వెంకటేష్ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

    Recommended Videos:

    Tags