Shiva jyothi: బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో శివజ్యోతి ఒకరని చెప్పవచ్చు. బిగ్ బాస్ షోలో శివజ్యోతి టాప్ 6 కంటెస్టెంట్ గా నిలిచారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ న్యూస్ ఛానల్ లో శివజ్యోతి పని చేస్తున్నారు. తెలంగాణ యాస, కట్టు ద్వారా సావిత్రికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు. శివజ్యోతికి సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది.

సొంత యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేసి ఆ వీడియోల ద్వారా కూడా శివజ్యోతి వార్తల్లో నిలిచారు. తాజాగా శివజ్యోతి గర్భవతి అంటూ జోరుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న ఈ వార్తలు అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే శివజ్యోతి వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి స్పందించి స్పష్టతనిచ్చారు. నా గురించి నాకు తెలియకుండానే వార్తలు వైరల్ అవుతున్నాయని శివజ్యోతి పేర్కొన్నారు.
Also Read: Amavasya: అమావాస్య రోజు అంతిక్రియలు అందుకే చేయరా ? వెనుకున్న ఆచారం అదేనా !
ఇటీవల తాను ఒక ఈవెంట్ కు వెళ్లే సమయంలో మామిడికాయతో ఫోటో పెట్టానని శివజ్యోతి వెల్లడించారు. మామిడికాయ ఫోటో పెట్టడం వల్ల గర్భవతి అని ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ కొరకు ఇష్టానుసారం థంబ్ నైల్స్ పెడుతున్నారని శివజ్యోతి కామెంట్లు చేశారు. వైరల్ అవుతున్న వార్తలు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కెరీర్ పై ప్రభావం చూపుతాయని శివజ్యోతి పేర్కొన్నారు.
మాకు చాలా సంవత్సరాల క్రితమే పెళ్లైందని శివజ్యోతి కామెంట్లు చేశారు. మా కుటుంబం కూడా పిల్లల కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని శివజ్యోతి అన్నారు. నేను కూడా ఆ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నానని శివజ్యోతి చెప్పుకొచ్చారు. వైరల్ అయ్యే వార్తలు ఎమోషనల్ గా ఎంతో బాధ పడతాయని శివజ్యోతి వెల్లడించారు. ప్రెగ్నెన్సీ చిన్న విషయం కాదని ఆ శుభవార్త ఉంటే నేనే అందరితో చెబుతానని శివజ్యోతి పేర్కొన్నారు.
Also Read: AP Govt Using Recovery Money: రికవరీ డబ్బులనూ వదలని జగన్ ప్రభుత్వం.. ఇదేం తీరు బాబు..!