Homeఎంటర్టైన్మెంట్OKtelugu MovieTime: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్

OKtelugu MovieTime: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్

OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను క్రేజ్ సంపాదించుకున్న సన్నీ లియోన్… తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘అనామిక’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ షోలో సన్నీ “స్పై” పాత్రలో కనిపించనుంది. విక్రమ్ భట్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ‘MX ప్లేయర్’లో మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ఉచితంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లో అందరికి అందుబాటులో ఉండనుంది.

sunny leone
sunny leone

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పారిశ్రామికవేత్త గాలి జనార్ధనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ ద్విభాషా చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 4న బెంగళూరులో జరగబోతోంది. ఇతను ఇప్పటికే నటన, డ్యాన్స్, ఫైటింగ్‌లలో శిక్షణ తీసుకున్నాడు. సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తాడు. సంగీతం DSP, సినిమాటోగ్రఫీ సెంథిల్ అందిస్తున్నారు.

Also Read:   అమ్మాయిల చేతిలో బఫూన్ అవుతున్న ఫేమస్ యాంకర్

 

kireeti reddy
kireeti reddy

ఇక ఇంకో అప్ డేట్ విషయానికి వస్తే.. తమిళ స్టార్ హీరో సూర్య తాజా మూవీ ‘ET(ఎవరికీ తలవంచడు)’ నుంచి మార్చి 2న ఉ.11.30 గంటలకు ట్రయిలర్ విడుదల కానుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ట్రయిలర్‌ను రిలీజ్ చేస్తాడని చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను పంచుకుంది.

et
et

కాగా పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించింది. మార్చి 10న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Also Read:  ముమైత్ ఖాన్ యాక్షన్.. శ్రీరాపాక రియాక్షన్

7 Arts Sarayu Crying || Sarayu Hamida Fight || Bigg Boss Telugu OTT || Ok Telugu Entertainment

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version