https://oktelugu.com/

Bigg Boss OTT Ariyana Glory: ఓటింగ్ శాతం ఆమెకే ఎక్కువ‌.. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు ఎలిమినేట్ కాక త‌ప్ప‌దా..!

Bigg Boss OTT Ariyana Glory: నాన్ స్టార్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఇవ్వ‌డానికి బిగ్ బాస్ ఈ సారి ఓటీటీ వేదిక‌గా స్ట్రీమింగ్ జ‌రుగుతోంది. ఇక హౌస్ లో ఉన్న 17 మందిలో కొత్త వారితో పాత‌వారికి టాస్క్ లు పెడుతున్నారు బిగ్ బాస్‌. గ‌తంలో పాల్గొని ర‌చ్చ ర‌చ్చ చేసిన బ్యూటీల‌ను ఈ సారి రంగంలోకి దించాడు బిగ్ బాస్‌. అంతా ఊహించ‌న‌ట్టు గానే.. రెండో రోజు నుంచే అస‌లైన ఆట మొద‌లైంది. గొడ‌వ‌లు, […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 2, 2022 / 12:10 PM IST
    Follow us on

    Bigg Boss OTT Ariyana Glory: నాన్ స్టార్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఇవ్వ‌డానికి బిగ్ బాస్ ఈ సారి ఓటీటీ వేదిక‌గా స్ట్రీమింగ్ జ‌రుగుతోంది. ఇక హౌస్ లో ఉన్న 17 మందిలో కొత్త వారితో పాత‌వారికి టాస్క్ లు పెడుతున్నారు బిగ్ బాస్‌. గ‌తంలో పాల్గొని ర‌చ్చ ర‌చ్చ చేసిన బ్యూటీల‌ను ఈ సారి రంగంలోకి దించాడు బిగ్ బాస్‌. అంతా ఊహించ‌న‌ట్టు గానే.. రెండో రోజు నుంచే అస‌లైన ఆట మొద‌లైంది. గొడ‌వ‌లు, తిట్టుకోవ‌డాలు, రివేంజ్ గేమ్ ల‌తో నానా బీభ‌త్సం సృష్టిస్తున్నారు కంటెస్టెంట్లు.

    Bigg Boss OTT Ariyana Glory

    అయితే వ‌చ్చి నాలుగు రోజులు కూడా కాక‌ముందే.. ఒక‌రిపై ఒక‌రు చాలా కోపాన్ని బ‌య‌ట పెట్టేసుకుంటున్నారు. బ‌య‌ట వారికి ఉన్న గొడ‌వ‌ల‌ను హౌస్ లో రివేంజ్ తీర్చుకుంటున్నారు. అందుకే మొద‌టి వారం నామినేష‌న్లు చివ‌రి వారం అన్న‌ట్టు ర‌స‌వ‌త్త‌రంగా సాగాయి. ఇక మొద‌టి వారంలో ఏడుగురు నామినేట్ అయ్యారు.

    Also Read:  హౌస్‌లో హంగామా సృష్టిస్టున్న ముమైత్‌.. ఛాలెంజ‌ర్స్ టీమ్‌తో పెద్ద గొడ‌వ‌

    ఇందులో బోల్డ్ బ్యూటీ స‌ర‌యు, నటరాజ్ మాస్టర్, యాంక‌ర్ అరియానా గ్లోరితో పాటుగా హమీదా, ఐటం బాంబ్ ముమైత్ ఖాన్, ఆర్జే చైతూ అలాగే మిత్రా శర్మ ఉన్నారు. ఇక ఈ ఏడుగురిని కాపాడుకునేందుకు వారి ఫ్యాన్స్ బ‌య‌ట నుంచి ఓట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. త‌మ అభిమాన కంటెస్టెంట్ మొద‌టి వార‌మే ఎలిమినేట్ కాకుండా చూసుకుంటున్నారు.

    Bigg Boss OTT Ariyana Glory

    ఇక నామినేట్ అయిన వారిలో అంద‌రికంటే ఎక్కువ‌గా 34.5 ఓటింగ్ శాతంతో అరియానా టాప్ లో ఉంది. రెండో ప్లేస్ లో ఆర్జే చైతు 16 శాతంతో ఉండ‌గా. 14.5 శాతంతో మూడో ప్లేస్ లో హమీదా ఉంది. నటరాజ్ మాస్టర్ 14 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక బోల్డ్ బ్యూటీ సరయు 10.5 శాతంతో ఐదో ప్లేస్ లో ఉంది. అయితే ముమైత్ వీరంద‌రికంటే వెన‌క‌బ‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. ఆమెకు ఇప్ప‌టి వ‌ర‌కు 8శాతం ఓటింగ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆమె ఆరో ప్లేస్ లో కొన‌సాగుతోంది. చివరి ప్లేస్ లో మిత్రా శర్మా అంద‌రి కంటే దారుణంగా 6 శాతం ఓటింగ్ తో కొన‌సాగుతున్నాడు. చూస్తుంటే.. ముమైత్‌, లేదా మిత్రాశ‌ర్మాల‌లో ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అయ్యేలాగే ఉన్నారు. కానీ బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి స‌ర్ ప్రైజ్‌లు ఇస్తారో చెప్ప‌లేం కాబ‌ట్టి.. చివ‌రి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

    Also Read: బ‌య‌ట గొడ‌వ‌ల‌ను హౌస్ లో చూపించుకుంటున్న కంటెస్టెంట్లు.. ముమైత్ అలాంటిదే అంటున్న శ్రీరాపాక‌..!

     

    Tags