Eagle: టాలీవుడ్ సీక్వెల్స్.. ఈగల్ కు కూడా పాకిందా?

ప్రస్తుతం వస్తున్న కొన్ని సినిమాలకు సీక్వెల్స్ కు కనెక్షన్ లను ఇచ్చేలా ఓపెన్ ఎండింగ్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకుంటున్నాయి.

Written By: Swathi, Updated On : February 9, 2024 5:39 pm

Eagle

Follow us on

Eagle: ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు సీక్వెల్స్ వస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో ఈ సంఖ్య మరింత ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ చేయాలంటే అది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత సీక్వెల్ తెరకెక్కించాలా లేదా అనే విషయాన్ని ఆలోచించి మరీ నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పద్దతి మారింది. మొదటి సినిమా రిజల్ట్ తెలియకుండానే సీక్వెల్ ను అనౌన్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం వస్తున్న కొన్ని సినిమాలకు సీక్వెల్స్ కు కనెక్షన్ లను ఇచ్చేలా ఓపెన్ ఎండింగ్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకుంటున్నాయి. అంతేకాదు సీక్వెల్ లీడ్ ను ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

కానీ కొన్ని సినిమాల్లో మాత్రం సీక్వెల్ కు లీడ్ పాయింట్ ను ఇచ్చేలా మొదటి బాగాన్ని సరిగ్గా తెరకెక్కించడం లేదు. ట్రెండ్ తగ్గట్లు మేకింగ్ లో మార్పు చూపించడం సరైన అంశమే. కానీ సీక్వెల్ ని దృష్టిలో పెట్టుకొని ప్రీక్వెల్ ని సరిగ్గా చూపించలేకపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో డజనుకు పైగా సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి రవితేజ ఈగల్ సినిమాకు కూడా వచ్చి చేరింది. ఈ రోజు రిలీజైన ఈ సినిమా ముగింపులో సీక్వెల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

అయితే రానున్న రోజుల్లో టాలీవుడ్ లో రాబోయే సీక్వెల్స్ గురించి మాట్లాడుకుంటే.. ఈగల్ తో కలుపుకొని మొత్తం 16 సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్ లో రాబోయే సీక్వెల్స్ విషయానికి వస్తే.. పుష్ప, సలార్, దేవర, జై హనుమాన్, కార్తికేయ 3. రీజినల్ లెవల్ లో రాబోయే సీక్వెల్స్ ఏంటంటే.. అఖండ, బింబిసారా, గూఢచారి, హిట్, విరూపాక్ష, గీతాంజలి, ఇస్మార్ట్ శంకర్, ప్రాజెక్ట్ z, డీజే టిల్లు, శతమానంభవతి. మరి ఈసినిమాలకు సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయో.. అవి ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాలి.