Telugu Movie Trends: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు ప్రస్తుతం ఉన్న దర్శకులు ఫ్యామిలీ సినిమాలను చేసి స్పెషల్ ఐడెంటిటి తెచ్చుకుంటున్నారు. ఈ సంవత్సరంలో సక్సెస్ అయిన ప్రతి సినిమా కూడా ఫ్యామిలీ సినిమానే కావడం విశేషం… సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా ఫ్యామిలీ చూడదగిన సినిమా కావడంతో సినిమాకి భార్య కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ మూవీ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించింది తద్వారా సక్సెస్ అయింది…ఇక రీసెంట్ గా సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ను సైతం చాలా బాగా చూపించారు.
కాబట్టి సినిమా సక్సెస్ సాధించింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన రవితేజ ‘ఇరుముడి’ సినిమా సైతం ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేసింది. అందువల్ల ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి రికార్డు కలెక్షన్స్ ను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఒకరకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాల హవా మరోసారి మొదలైందనే చెప్పాలి.
ఇంతకుముందు ఫ్యామిలీ సినిమాలు వచ్చేవి ప్రేక్షకులను అలరించేవి కానీ ఈ మధ్యకాలంలో బోల్డ్ సినిమాలు యూత్ ను అట్రాక్ట్ చేసే సినిమాలు ఎక్కువైపోవడం వల్ల ఫ్యామిలీ సినిమాలకు ఆదరణ తగ్గిందని చాలామంది అనుకున్నారు. కానీ ఫ్యామిలీ సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించగలుగుతాయి అంటూ నమ్మకాన్ని తీసుకొచ్చిన సినిమాలు మాత్రం ఇవే…
ఈ సంవత్సరంలో సక్సెస్ అయిన టాప్ మోస్ట్ సినిమాల్లో ఫ్యామిలీ సినిమాలే మొదటి స్థానంలో ఉండడం ప్రతి ఒక్కరిని ఆనందపరిచే విషయమనే చెప్పాలి… రాబోయే రోజుల్లో మరిన్ని ఫ్యామిలీ సినిమాలతో మన స్టార్ హీరోలు వచ్చి సక్సెస్ లను సాధిస్తే చూడాలని వాళ్ళ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…