Tollywood : ప్రస్తుతం పాన్ ఇండియాలో వస్తున్న సినిమా మధ్య భారీ పోటీ అయితే నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలకు మాత్రమే భారీ కలెక్షన్స్ వస్తాయి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే విధంగా ముందుకు సాగుతుంది అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాను లీడ్ చేసే ఇండస్ట్రీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నే అంటూ కొంతమంది సీనిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2(Pushpa 2)సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు రాబోతున్న స్టార్ హీరోల సినిమాలతో 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అమీర్ ఖాన్(Ameer Khan) హీరోగా వచ్చిన దంగల్ (Dhangal) సినిమా 1950 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.
కాబట్టి ఇప్పుడు రాబోతున్న తెలుగు సినిమాలు సైతం దంగల్ రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాయి. మన స్టార్ హీరోలు భారీ ఎత్తున కసరత్తులు చేస్తూ రాబోతున్న సినిమాలతో తొందర్లోనే దంగల్ సినిమా రికార్డు బ్రేక్ అయి 2000 కోట్ల మార్కును క్రాస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తున్న గుర్తింపును చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ ఓర్చుకోలేకపోతుందనేది వాస్తవం… అందుకే మన దర్శకుల మీద మన సినిమాల మీద వాళ్లు ట్రోల్స్ చేస్తూ రక్షస ఆనందాన్ని పొందుతున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియా మొత్తంలో మన సినిమాల మీద బాలీవుడ్ సినిమా క్రిటిక్స్ సైతం నెగెటివ్ గా స్పందిస్తున్నారు. వాళ్లు ఎలా స్పందించిన కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో రాబోయే రోజుల్లో యావత్ ప్రపంచం మొత్తానికి తెలియబోతుంది. అందువల్ల ఈ విషయాలను మైండ్ లో పెట్టుకొని వ్యవహరిస్తే మంచిది అంటూ మరికొంతమంది ఘాటుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు…
Also Read : మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం..? టీమ్ షాకింగ్ ప్రకటన, నిజం ఏమిటంటే?