https://oktelugu.com/

ప్చ్.. ఆ వ్యసనంతో కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ !

తెలుగు బడా స్టార్స్, చోటా స్టార్స్ అందరికీ ఇప్పుడు ఒక్కటే టార్గెట్.. అదే ‘పాన్ ఇండియా’ సినిమా. మహేష్ బాబు ఒక్కడే పాన్ ఇండియా మనకు ఎందుకులే అని కామ్ అయిపోతున్నాడు. ఇక ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా టాప్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు చేస్తున్నారు. అయితే వీరితో పాటు విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్, అడివి శేష్ లాంటి చోటా హీరోలు కూడా పాన్ ఇండియా […]

Written By: , Updated On : July 8, 2021 / 12:53 PM IST
Follow us on

Pan India Movies in Tollywood

తెలుగు బడా స్టార్స్, చోటా స్టార్స్ అందరికీ ఇప్పుడు ఒక్కటే టార్గెట్.. అదే ‘పాన్ ఇండియా’ సినిమా. మహేష్ బాబు ఒక్కడే పాన్ ఇండియా మనకు ఎందుకులే అని కామ్ అయిపోతున్నాడు. ఇక ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా టాప్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు చేస్తున్నారు.

అయితే వీరితో పాటు విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్, అడివి శేష్ లాంటి చోటా హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి కిందామీదా పడుతున్నారు. ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘పాన్ ఇండియా’ అనేది ప్రస్తుతం కామన్ అయిపోయింది. అలాగే మాది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పుకోవడం ఈజీ అయిపోయింది.

మరి క్రేజ్ ఎక్కడ ఉంటుందో ఏ పదానికి ఉంటుందో దాన్నే వాడటం మనవాళ్లకు బాగా అలవాటు. మరి ఇంతకీ పాన్ ఇండియా సినిమాలు ఎవరెవరు చేస్తోన్నారో ఒకసారి చూద్దాం. ముందుగా ‘ఆర్ ఆర్ ఆర్’తో ఎన్టీఆర్, రామ్ చరణ్ జాతీయ స్థాయి మార్కెట్ కోసం కలిసి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ తన తదుపరి సినిమాని శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమానే సెట్ చేసుకున్నాడు.

అలాగే ఎన్టీఆర్ కూడా కొరటాల, ప్రశాంత్ నీల్ తో వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేశాడు. విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాని పాన్ ఇండియా సినిమాగానే చేస్తున్నాడు. అడివి శేష్ ‘మేజర్’ కూడా పాన్ ఇండియా మూవీనే. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ చేస్తోన్న ‘డెవిల్’ కూడా ‘పాన్ ఇండియా’ మూవీనే. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలోనే డైరెక్ట్ గా ఒక మూవీ చేస్తున్నాడు. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే టాలీవుడ్ లో ‘పాన్ ఇండియా’ అనేది ఒక వ్యసనం అయిపోయింది.