https://oktelugu.com/

జగన్.. షర్మిల.. విభేదాలు నిజమే అన్నట్టు?

నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఆయన ఇద్దరు పిల్లలకు , కుటుంబానికి ఒకరకమైన పండుగ లాంటి రోజునే. ఈరోజును తండ్రికి నివాళులర్పించేందుకు ఏపీ సీఎం జగన్.. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల ఇడుపులపాయ వెళుతున్నారు. అయితే వీరిద్దరి మధ్యన విభేదాలున్నాయని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. అదిప్పుడు వాస్తవం అని తేటతెల్లమైంది. తాజాగా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు తెలంగాణ నుంచి బయలుదేరి బెంగళూరు మీదుగా ఉదయం షర్మిల చేరుకున్నారు. అక్కడి తండ్రి వైఎస్ఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2021 2:18 pm
    Follow us on

    నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఆయన ఇద్దరు పిల్లలకు , కుటుంబానికి ఒకరకమైన పండుగ లాంటి రోజునే. ఈరోజును తండ్రికి నివాళులర్పించేందుకు ఏపీ సీఎం జగన్.. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల ఇడుపులపాయ వెళుతున్నారు. అయితే వీరిద్దరి మధ్యన విభేదాలున్నాయని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. అదిప్పుడు వాస్తవం అని తేటతెల్లమైంది.

    తాజాగా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు తెలంగాణ నుంచి బయలుదేరి బెంగళూరు మీదుగా ఉదయం షర్మిల చేరుకున్నారు. అక్కడి తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పించి హైదరాబాద్ వస్తున్నారు. అయితే జగన్ మాత్రం షర్మిలతోపాటు నివాళులు అర్పించడం లేదు. ఆయన తన ప్రోగ్రాంను సాయంత్రం 4 గంటలకు ఫిక్స్ చేయడం గమనార్హం. సాయంత్రం లోపు షర్మిల హైదరాబాద్ వెళ్లి అక్కడ పార్టీ ప్రకటిస్తుంది.

    నిజానికి ఇదే ఉదయం జగన్ కూడా రావాల్సింది కానీ.. షర్మిల పర్యటన నేపథ్యంలోనే మధ్యాహ్నానికి ఇడుపుల పాయకు పెట్టుకున్నారు జగన్. అంటే షర్మిల వెళ్లాకే ఇడుపుల పాయకు జగన్ రాబోతున్నారు. దీంతో చెల్లి షర్మిలతో కలిసి తండ్రికి జగన్ నివాళులర్పించరు. సపరేట్ గా వీరి కార్యక్రమం జరగబోతోంది.

    ఇక షర్మిల సైతం అన్న జగన్ ను దూరం పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈరోజు ఆమె తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఆంధ్రజ్యోతికి ఫుల్ మొదటి పేజీ యాడ్ ఇచ్చి సాక్షికి ఇవ్వలేదు. ఈ మధ్యన సాక్షి తమ వార్తలు కవర్ చేయడం లేదని బహిరంగంగానే నిరసనలో అన్నారు. దీంతో అన్నా చెల్లెలు మధ్యన విభేదాలు ఉన్నాయని.. వీరిద్దరూ ముఖం చూపించడానికి కూడా సిద్ధపడడం లేదని పరిణామాలను బట్టి తెలుస్తోంది.