Tollywood heroes: “జై భీమ్” సినిమా… ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైన సినిమా. దైవం మానుష రూపేణ అన్నారు. ఇది సమాజం మరువకూడదు, ఇదే అంశాన్ని చెప్పిన సినిమా ఇది. ఒక స్టార్ హీరో మూల కథలతో, రోత పాత్రలతో తన స్థాయిని తానే తగ్గించుకుంటుంటే తన ముందున్న నిష్కృతి మార్గం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవటమే.
తమిళ హీరో సూర్య అదే చేశాడు. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలతో సూర్య తన స్థాయిని రెట్టింపు చేసుకున్నాడు. సినిమా స్థాయిని పెంచాడు. ఇలాంటి సున్నితమైన అంశం పై సినిమా అంటే సృజనకు పెద్ద పరీక్ష. అందుకే, నిజజీవితాలనో నిజసంఘటనలనో ఆధారంగా తీసుకుని వాటికి వీలైనంత దగ్గరగా, ఫిల్మీ లిబర్టీలు తీసుకుంటారు.
కానీ సూర్య వాటిపై ఆసక్తి చూపించలేదు. పైగా సమాజంలోని కుళ్ళును బలంగా చూపించాడు. సమాజాన్ని సజావుగా సాగించే శాసన విధాన న్యాయసభలు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాయో వివరంగా వివరించాడు. దేశ పురోగతికి గణాంకాలు మాత్రమే కొలమానం అయినంత కాలం, నిమ్న వర్గాలు అణచివేయబడుతూనే ఉంటాయని తన సినిమాలో బలమైన మెసేజ్ కూడా ఇచ్చాడు.
పైగా తమిళనాడులో ఓ లాయర్ చేసిన గొప్ప పనినే హీరోయిజమ్ లా చూపించాడు. కొండొకచో ఒక వ్యక్తి అన్యాయాన్ని ఎదురొడ్డి పోరాడితే కొందరికి మాత్రమే ఓదార్పు కాదు, అది సమాజానికి కూడా ఓదార్పే అని సూర్య జై భీమ్ లో ఎలివేట్ అయ్యేలా జాగ్రత్త పడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే.. జై భీమ్ సినిమా కాదు. నిజ సంఘటనల పై వచ్చిన బాధాకరమైన కథనాలు.
Also Read: Akhanda Movie: అఖండ సినిమాలో ” నటించిన ఈ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా ?
వ్యక్తుల ప్రేరణతో వ్యవస్థలో గిరిజనులపై జరిగే అమానుష అన్యాయాలపై గళమెత్తిన ఓ నిజాయితీ గల సినిమా. మూఢ శాసనాల నుంచి, చట్టాల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించాలనే ఆలోచనను రేకెత్తించే సినిమా. స్టార్ హీరో సినిమా అంటే.. ఐటెం పాటలు, హీరోయిజం లాంటి చేష్టలే కాదు, గొప్ప సందేశం కూడా ఉంటుందని చాటి చెప్పిన సినిమా. మన హీరోలు కూడా ఇలాంటి కథలు చేయాలనే ఆలోచిస్తే మంచిది.
Also Read: Prakash Raj: ‘మా’పై ప్రకాష్ రాజ్ పోరాటం ముగిసినట్లేనా!