Nikhil: వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్లిపోతున్న నిఖిల్.. ఎన్ని సినిమాలు ఒప్పుకున్నాడో తెలుసా?

Nikhil: ఇటీవల కాలంలో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకెళ్లిపోతున్న కుర్ర హీరోల వరుసలో ముందున్నారు నిఖిల్​. హ్యాపీడేస్​ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్​.. ఆ తర్వాత వరుసగా సోలో చిత్రాలు తీస్తూ.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బ్యాక్​ టు బ్యాక్​ సినిమాలతోొ షూటింగుల్లో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు నిఖిల్​. ఇప్పటికే 18 పేజెస్​, కార్తికేయ 2 సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నారు నిఖిల్. ఈ రెండు సినిమాల్లోనూ అనుపమ పరమేశ్వరన్​ హీరోయిన్​గా నటిస్తోంది. కాగా, […]

Written By: Raghava Rao Gara, Updated On : November 20, 2021 10:33 am
Follow us on

Nikhil: ఇటీవల కాలంలో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకెళ్లిపోతున్న కుర్ర హీరోల వరుసలో ముందున్నారు నిఖిల్​. హ్యాపీడేస్​ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్​.. ఆ తర్వాత వరుసగా సోలో చిత్రాలు తీస్తూ.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బ్యాక్​ టు బ్యాక్​ సినిమాలతోొ షూటింగుల్లో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు నిఖిల్​. ఇప్పటికే 18 పేజెస్​, కార్తికేయ 2 సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నారు నిఖిల్. ఈ రెండు సినిమాల్లోనూ అనుపమ పరమేశ్వరన్​ హీరోయిన్​గా నటిస్తోంది.

కాగా, సుకుమార్​ రైటింగ్స్​లో నిఖిల్​ 18 పేజెస్​ సినిమా తీస్తున్నారు. ఇందులో నిఖిల్​ ఎప్పుడూ కనిపించని భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో నిఖిల్​ డ్యుయల్​ రోల్​ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న కార్తికేయ 2లోనూ నటిస్తున్నారు నిఖిల్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన కార్తికేయ ఎంత హిట్​ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే మరోసారి ప్రేక్షకులను థ్రిల్​ చేసేందుకు సిద్ధమయ్యారు నిఖిల్. వీటితో పాటు, మరో సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు నిఖిల్. గ్యారీ బీహెచ్​ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.  రెడ్ సినిమాస్ ప‌తాకంపై కే రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీటితో పాటు, మరో రెండు సినిమాలు కూడా నిఖిల్​ చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్​లో ఉన్న సినిమాలు విడుదలైన తర్వాతే ఈ రెండింటిని ఒకేసారి సెట్స్​పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.