Homeఎంటర్టైన్మెంట్Tollywood Stars: మొదటి సినిమాతోనే హిట్ కొట్టి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలు, హీరోయిన్లు వీరే...

Tollywood Stars: మొదటి సినిమాతోనే హిట్ కొట్టి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలు, హీరోయిన్లు వీరే !

Tollywood Stars: మొదటి ప్రయత్నంలోనే  విజయం సాధిస్తే  ఆ విజయం తాలూకు జ్ఞాపకమే వేరు.  ఇక సినిమా  ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే  సక్సెస్ రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి.  అలాంటిది, పెద్దగా టాలెంట్ లేకపోయినా  పైగా ఎక్కువ ప్రయత్నాలు చేయకుండానే.. అదృష్టంతో   డెబ్యూ మూవీ తోనే హిట్ కొట్టిన కొందరు హీరోహీరోయిన్లు ఉన్నారు. ప్రతి హీరోహీరోయిన్ ఎంట్రీలోనే  హిట్  కొట్టాలనే కష్టపడతారు.  కానీ  ఇండస్ట్రీలో ఏ గాలి ఎటు వైపు మళ్ళుతుందో..   ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో చెప్పలేం. అయితే,  ఇలాంటి పరిస్థితుల్లో కూడా   కొందరికి  అదృష్టం కలిసొచ్చి   మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంటారు. మరి  డెబ్యూ మూవీస్ తోనే  సూపర్  హిట్స్  అందుకున్న  ఆ హీరో, హీరోయిన్లు   ఎవరో చూద్దాం.

#1) చిత్రం

Chitram (2000) - IMDb
Chitram Movie

విడుదల తేదీ  :    2000వ సంవత్సరంలో  మే  25న విడుదల అయింది. ఉదయ్ కిరణ్,  రీమా సేన్ అనే కొత్త నటీనటులను పెట్టి..  దర్శకుడు  తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తీసుకున్న కథలో బోల్డ్ నెస్ ఉండటం..  ఆ బోల్డ్ లో కూడా ఒక డీసెంట్ ఎమోషన్ ఉండటం..   మొత్తానికి ఈ సినిమా హిట్ కి ముఖ్య కారణం అయింది.  నిజానికి హిట్ అనడం కంటే..   అసాధారణమైన బ్లాక్ బస్టర్ అని చెప్పడం కరెక్ట్.

#2) నువ్వేకావలి

Nuvve Kavali completes 20 years of its release today

విడుదల తేదీ :  2000వ సంవత్సరంలో   అక్టోబర్   13న విడుదల అయింది. తరుణ్, రిచా పల్లోద్ అనే కొత్త నటీనటులతో  త్రివిక్రమ్ రాసిన బ్యూటీఫుల్ స్క్రిప్ట్ తో   కె.విజయ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన  ఈ  నువ్వేకావాలి  భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
#3) జయం

Evaru Emanna Video Song || Jayam Movie || Nitin & Sadha - YouTube
Jayam Movie

విడుదల తేదీ :  2002వ సంవత్సరంలో  జూన్    14న విడుదల అయింది. నితిన్ రెడ్డి, సదా అనే కొత్త నటీనటులను పెట్టి..  దర్శకుడు  తేజానే  ఈ చిత్రాన్ని   తెరకెక్కించాడు.  అప్పట్లో ఈ  జయం సినిమాకి  ప్రత్యేక ఫ్యాన్స్ ఉండేవారు. ఏది ఏమైనా నితిన్ కి సదాకి  మొదటి చిత్రంతోనే  బ్లాక్ బస్టర్ ను  అందించిన సినిమా ఇది.

#4) గంగోత్రి

gangotri Movie
Gangotri Movie

విడుదల తేదీ :  2003వ సంవత్సరంలో  మార్చి  28న విడుదల అయింది. కె.రాఘవేంద్ర రావు  అల్లు అర్జున్, అదితి అగర్వాల్ అనే వాళ్ళను పెట్టి తన వందో సినిమా తీస్తున్నాడు అనగానే  ఈ సినిమా పై జనంలో అప్పట్లో ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి కారణంగానే ఈ సినిమాకి  ఓపెనింగ్స్ వచ్చాయి. అలా  గంగోత్రి చిత్రంతో  అల్లు అర్జున్  మొదటి  బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

#5) దేవదాసు

Ram Pothineni reminisces ''Devadasu'' as it completes 15 years | Telugu Movie News - Times of India
Devadasu Movie

విడుదల తేదీ  :  2006వ సంవత్సరంలో  జూన్   11న విడుదల అయింది. రామ్ పోతినేని, ఇలియానా హీరోహీరోయిన్లుగా   వై.వి.ఎస్.చౌదరి డైరెక్షన్లో వచ్చిన  ఈ  దేవదాస్ చిత్రం సూపర్ హిట్ అయింది.

 

 #6) ఉల్లాసంగా ఉత్సాహంగా

Ullasamga Utsahamga Movie || Priyatama Video Song || Yasho Sagar , Sneha Ullal - YouTube
Ullasamga Utsahamga Movie

విడుదల తేదీ  :  2008 వ సంవత్సరంలో  జూలై  25న విడుదల అయింది. యశో సాగర్,  స్నేహ ఉల్లాల్  హీరోహీరోయిన్లుగా  కరుణా కరణ్ డైరెక్షన్లో తెరకెక్కిన  ఈ చిత్రంతో యశో సాగర్,  స్నేహ ఉల్లాల్   మొదటి చిత్రంతో  సూపర్ హిట్ కొట్టారు.

#7) చిరుత

Watch Chirutha Full HD Movie Online on ZEE5
Chirutha Movie

విడుదల తేదీ  :  2007 వ సంవత్సరంలో  సెప్టెంబర్ 28న విడుదల అయింది. మెగా వారసుడిగా  రామ్ చరణ్ తేజ, నేహా శర్మ హీరోహీరోయిన్లుగా   పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాతో చరణ్ ఎంట్రీతోనే  సాలిడ్ హిట్ కొట్టాడు.

 #8) ఈ రోజుల్లో

eerojullo
Eerojullo Movie

విడుదల తేదీ  :  2012 వ సంవత్సరంలో  మార్చి   23న విడుదల అయింది.  శ్రీనివాస్, రేష్మి అనే కొత్త జంటతో  మారుతీ  డైరెక్షన్లో తెరకెక్కిన ఈ రోజుల్లో చిత్రంతో  మంచి హిట్ అయింది.

#9) ఉప్పెన

uppena movie
Uppena Movie

విడుదల తేదీ  :  2021వ సంవత్సరంలో  ఫిబ్రవరి  12న విడుదల అయింది. మెగా మేనల్లుడు  పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా   కృతి శెట్టి హీరోయిన్ గా  బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో  కృతి శెట్టికి, వైష్ణవ్ తేజ్ కి  మొదటి చిత్రంతోనే సూపర్ హిట్  వచ్చింది.

RELATED ARTICLES

Most Popular