Tollywood Heroines : ముఖ్యంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాలలో నటిస్తున్న హీరోయిన్లు ఈ సినిమాలతో తమ ఫేట్ మారుతుంది అని ఎన్నో ఆశలతో ఉన్నారు. తన సినిమా కెరియర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా హరిహర వీరమల్లు సినిమాలో పిరియాడిక్ రోల్ లో నటిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి వాయిదా పడుతున్న ఈ సినిమా చివరకు జూన్ 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులలో కొత్త జోష్ ఏర్పడింది. ఇక ఈ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఈ సినిమా డేట్ ప్రకటించడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది. చాలా కాలం నుంచి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో తన కల త్వరలో నెరవేరబోతుంది అనే నమ్మకంతో ఉంది.
Also Read : అబ్బురపరిచిన ‘మిరాయ్’ టీజర్ విజువల్స్..మరోసారి చరిత్ర సృష్టించబోతున్న తేజ సజ్జ!
అలాగే పవన్ కళ్యాణ్ ఓ జి సినిమాలో నటిస్తున్న ప్రియాంక అరూల్ మోహన్ కూడా ఓ జి సినిమా రిలీజ్ విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ రావడంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. అలాగే చాలా కాలం నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ప్రియాంక అరూల్ మోహన్ కూడా ఓజీ సినిమాతో తన దశ తిరుగుతుందని భావిస్తుంది. ఇక అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అప్డేట్ కూడా రావడంతో యంగ్ బ్యూటీ శ్రీ లీలా కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీ లీల తన ఆశలన్నీ పవన్ సినిమా మీదనే పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ తర్వాత శ్రీ లీలా కూడా టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఇది ఇలా ఉంటే మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తున్నారు. ఒకపక్క పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక త్వరలో జూన్ 12న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని పిరియాడిక్ పాత్రలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు.