Tollywood Heroine: తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతూ ఉండడం చూసిన ఈమె అంకాలజిస్ట్ కావాలని అనుకుంది. అనుకున్నట్టుగానే బాగా చదువుకుని ఎంబిబిఎస్ కూడా పూర్తి చేసింది. కానీ అనుకోకుండా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో శివుని గెటప్ లో ఉన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా. ఈమెకు చిన్నతనం నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కూచిపూడి, భరతనాట్యం వంటి క్లాసికల్ డాన్స్ లలో ప్రత్యేక శిక్షణ పొందింది. పలు డాన్స్ షోలో కూడా పాల్గొని ఈ బ్యూటీ బహుమతులు కూడా సొంతం చేసుకుంది. ఏడేళ్ల చిన్న వయసులోనే మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేతుల మీదుగా అవార్డును కూడా అందుకుంది. బుల్లితెర మీద ప్రసారమయ్యే పలు రియాలిటీ షోలలో కూడా సందడి చేసింది. పలు కల్చరల్ ఈవెంట్స్ అలాగే పలు ప్రోగ్రామ్స్ లో కూడా ఈమె పాల్గొనింది. అదే సమయంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారు నిర్వహించిన కార్తిక దీపోత్సవం అనే ప్రోగ్రాంలో ఈమె సందడి చేసింది.
Also Read: ఓజీ వచ్చేది అప్పుడే…మరోసారి క్లారిటీ ఇచ్చిన దర్శక నిర్మాతలు…
ఈ షోలో ఈమె శివుని గెటప్ లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈమె డాన్స్ వీడియోలు చాలానే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది షార్ట్ ఫిలిమ్స్ లో ఆ తర్వాత సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఈమె టాలీవుడ్ లో మూడు సినిమాలలో నటించింది. రీసెంట్గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ మీ సొంతం చేసుకున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా కనిపించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈమె పేరు తెగ వినిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు సారంగపాణి జాతకం సినిమా హీరోయిన్ రూప కొడువాయుర్. రీసెంట్గా సినిమా రిలీజ్ అయిన సందర్భంగా రూప గురించి పది ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి.
పేరు చూస్తే ఈమె మలయాళీ అమ్మాయి లాగా అనిపిస్తుంది కానీ రూప అచ్చమైన తెలుగు అమ్మాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన రూపా 2020లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్యా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. సినిమాలలోకి రాకముందు రూప ఫౌజి అనే తెలుగు షార్ట్ ఫిలింలో కూడా నటించడం జరిగింది. ఆ తర్వాత ఈ చిన్నది బిగ్బాస్ ఫేమ్ సుహేల్ కు జోడిగా 2023లో రిలీజ్ అయిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. లేటెస్ట్ గా సారంగపాణి జాతకం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో రూప నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఒకపక్క సినిమాలు చేస్తేనే ఈమె మరోపక్క డాక్టర్ గా కూడా తన విధులను నిర్వహిస్తుంది. ఎంబిబిఎస్ చదువు పూర్తి అయిన తర్వాత రూప కొడువాయుర్ లండన్ లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కూడా పూర్తి చేసింది.
View this post on Instagram