Interest Rates: ముఖ్యంగా పెరుగుతున్న టెక్నాలజీతో నగదు లావాదేవీల అవసరం లేకుండా ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోని చాలామంది కస్టమర్లు తమ డబ్బు మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోనే ఉంచుతున్నారు. తాజాగా కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్ తెలిపాయి. సేవింగ్ ఖాతాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు కొన్ని బ్యాంకులు ప్రకటించాయి. ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును 25 బేసిస్ పాయింట్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం రేపో రేటు ఆరు శాతానికి చేరుకుంది. ఈ క్రమంలోనే దాదాపు అన్ని బ్యాంకులు కూడా తమ బ్యాంకులో ఉన్న పొదుపు ఖాతా డిపాజిట్ లపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఎంపీసీ సభ్యులు తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి సమావేశం లో అలాగే ద్రవ్య విధాన కమిటీ 54వ సమావేశంలో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది.
Also Read: ఓజీ వచ్చేది అప్పుడే…మరోసారి క్లారిటీ ఇచ్చిన దర్శక నిర్మాతలు…
ఇటీవల దీని గురించి ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రేపో రేటును తక్షణమే ఆరు శాతానికి తగ్గించారని ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర వాణిజ్య బ్యాంకులకు డబ్బులు ఇచ్చే రేటును రెపో రేటు అంటారు. పెట్టుబడులను పెంచే లక్ష్యంతో రేపోరేట్ తగ్గింపు రుణాలు ఆధారపడి ఉంటాయి. దాంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును తగ్గించిన వెంటనే ఇతర బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులో తమ బ్యాంకులో సేవింగ్ ఖాతాల వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పొదుపు ఖాతాలపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ వడ్డీ రేటును 0.25 శాతానికి తగ్గించడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ రుణాన్ని ఇచ్చే బ్యాంక్.
తాజాగా ఈ బ్యాంకు పొదుపు ఖాతాలలో 50 లక్షల కంటే తక్కువ డిపాజిట్ లపై 2.75 శాతం వడ్డీని అలాగే పొదుపు ఖాతాలలో 50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు పై 3.25% వడ్డీని అందిస్తుంది. తన స్థిర డిపాజిట్ రేట్లను కూడా ఈ బ్యాంకు 0.35 నుంచి తగ్గించి 0.40 శాతానికి తగ్గించడం జరిగింది. ఏప్రిల్ ఒకటి, 2025 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి రానున్నట్లు సమాచారం. అలాగే తన సేవింగ్ ఖాతాల డిపాజిట్ వడ్డీ రేటును ఐసిఐసిఐ బ్యాంకు కూడా 0.25% తగ్గిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ బ్యాంకు తమ కస్టమర్ల పొదుపు ఖాతాలలో 50 లక్షల డిపాజిట్ పై 2.75% వడ్డీ రేటును అందిస్తుంది. ఏప్రిల్ 16, 2025 నుంచి ఐసిఐసిఐ బ్యాంకు సవరించిన ఈ కొత్త వడ్డీ రేట్లు అమలు జరుగుతాయి.