Post Office Schemes: అధిక వడ్డీతోపాటు సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే వారికి ఈ పథకం చాలా బెస్ట్. ఈ పథకం ఒక డిపాజిట్ పథకం. కేవలం ఐదు సంవత్సరాలు ఈ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడం వలన మంచి వడ్డీ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంపై ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ 7.7% వడ్డీ రేటును అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకంలో కనిష్టంగా 1000 రూపాయలతో ప్రారంభించవచ్చు. అలాగే గరిష్టంగా పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి పరిమితి లేదు. ఈ పథకంలో మీరు ఎంత మొత్తాన్ని అయిన పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఈ పథకంలో ఖాతా ఓపెన్ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో ఉమ్మడి ఖాతాను కూడా తెరవచ్చు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు పోస్ట్ ఆఫీస్ లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ తమ పేరు మీద కొనుగోలు చేయొచ్చు.
Also Read: ఓజీ వచ్చేది అప్పుడే…మరోసారి క్లారిటీ ఇచ్చిన దర్శక నిర్మాతలు
అలాగే ఒకేసారి మీరు ఎక్కువ నేషనల్ సేవించి సర్టిఫికెట్ ఖాతాలను తెరిచే అవకాశం కూడా ఉంది. ఈ పథకం ముఖ్య ప్రయోజనం ఏంటంటే ఈ పథకంలో మీరు చాలా కాలం పాటు డబ్బును డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం ఐదు సంవత్సరాలలో నేషనల్ సేవించి సర్టిఫికెట్ పథకం మెచ్యూరిటీ పొందుతుంది. వార్షిక ప్రాతిపదికన దీని మీద వచ్చే వడ్డీని చక్రవడ్డీ చేస్తారు. పథకం ప్రారంభంలో మీకు ఇచ్చిన హామీ ప్రకారం రాబడి అందుతుంది. మీరు పెట్టుబడి పెట్టే సమయంలో మీకు వర్తించే వడ్డీ రేటును బట్టి ఐదు సంవత్సరాల వడ్డీని లెక్కిస్తారు. ఒకవేళ తర్వాత వడ్డీ రేటు మారిన కూడా అది మీ ఖాతాను ప్రభావితం చేయదు.
అలాగే ఈ పథకంలో సెక్షన్ 80 సి కింద జమ చేసిన మొత్తం డబ్బుపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ప్రతి ఏడాది కూడా మీరు ఈ పథకంలో రూ.1.50 లక్షల వరకు ఉన్న డిపాజిట్ పై పన్ను మినహాయింపు పొందుతారు. కానీ ఈ పథకంలో పాక్షిక ఉపసంహరణ ఉండదు. ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ కాలం పూర్తి అయిన తర్వాత మాత్రమే మీరు ఒకేసారి ఈ డబ్బు మొత్తాన్ని పొందుతారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఖాతాను క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే మీరు ఒకవేళ ఈ పథకంలో 10 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే మీకు 4,49,034 రూపాయలు వస్తాయి. ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ కాలం తర్వాత మీకు మొత్తం 14,49,034 రూపాయలు చేతికి వస్తాయి.