Tollywood Heroine : ఈ క్రమంలో చాలామంది హీరో, హీరోయిన్లు సక్సెస్ వచ్చినప్పుడు రెచ్చిపోయి లేదా ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకుండా వరుసగా సినిమాలు చేస్తూ తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా చాలామంది తమ టాలెంట్ను నమ్ముకుని సినిమాలు చేస్తున్నారు. మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం కొంచెం భిన్నం. ఎంతోమంది అందమైన భామలు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. చాలా అందంగా ఉన్నప్పటికీ కూడా వీరు ఎక్కువగా అవకాశాలను అందుకోలేకపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో కేవలం నాలుగైదు సినిమాలలో మాత్రమే కనిపించి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కనిపించకుండా మాయమైపోతున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈ హీరోయిన్స్ ప్రస్తుతం ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి అభిమానులు సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే బ్యూటీ కోసం కూడా ఆమె అభిమానులు గూగుల్లో తెగ వెతుకుతున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈమె చేసింది 8 సినిమాలు. కానీ వాటిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈమె అందంలో అప్సరస. అయిన కూడా కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. అందం, అభినయం ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు.
సినిమాలలో మెయిన్ హీరోయిన్ గా అలాగే సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది. అయినా కూడా ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ టాలీవుడ్ బ్యూటీ మరెవరో కాదు ప్రణీత సుభాష్. హీరోయిన్ ప్రణీత గురించి టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన క్యూట్ నటనతో ప్రణీత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈమె అందానికి ముఖ్యంగా కుర్రాళ్ళు ఫిదా అయిపోతారు. తెలుగులో ప్రణీత సుభాష్ ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకొని సినిమాలు చేసింది. కానీ ఆమెకు హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు.
ఆ తర్వాత ఆమె సెకండ్ హీరోయిన్ గా కూడా సినిమాలలో చేసింది. అయినా కూడా సక్సెస్ కాలేకపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో మంచి విజయం అందుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఆమెకు అవకాశాలు రాలేదు. తెలుగులో ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో, అత్తారింటికి దారేది, బావ, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ప్రణీత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. ప్రస్తుతం ప్రణీతకు ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు తన అందంతో అందరిని కట్టిపడేస్తుంది.
View this post on Instagram