Star Actor : అవకాశం వస్తే వీళ్ళు ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీగా ఉంటారు. అలాగే లేడీ గెటప్స్ లో కూడా అద్భుతంగా నటించిన నటులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న నటుడు కూడా లేడీ గెటప్ లో చాలా అద్భుతంగా నటించారు. ఈ మధ్యకాలంలో ఈయన బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఎప్పుడు విభిన్న పాత్రలో ఉన్న సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. తమకు నచ్చిన మంచి పాత్ర దొరికితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపడానికి రెడీ అవుతారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు లేడీ గెటప్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న హీరోలే కాకుండా స్టార్ హీరోలు సైతం చాలెంజింగ్ రూల్స్ లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాలో కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతర సన్నివేశంలో లేడీ గెటప్ లో తన అద్భుతమైన నటనతో అదరగొట్టారు. ప్రస్తుతం ఫోటోలో వైరల్ అవుతున్న ఈ నటుడు ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యారు.
Also Read : ఫ్లాప్ లతో సతమతమవుతున్న హీరోయిన్లు.. ఆశలన్నీ పవన్ సినిమాల మీదనే పెట్టుకున్న బ్యూటీస్..
ఇతను తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. సినిమాలలో కేవలం కామెడీ పాత్రలే కాకుండా చాలెంజింగ్ పాత్రలలో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ మరాఠీ నటుడు ఉపేంద్ర యానిమల్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. యానిమల్ సినిమాలో ఉపేంద్ర కనిపించేది కేవలం కొంచెం సేపు అయినా కూడా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక రీసెంట్ గా ఉపేంద్ర లిమాయే అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా తన అద్భుతమైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరించారు. ఈ సినిమాలో ఉపేంద్ర ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో కనిపించి బాగా ఆకట్టుకున్నారు.
మరాఠీలో ఉపేంద్ర ఎన్నో సినిమాలలో నటించి మరాఠీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో మరాఠీలో ఉపేంద్ర నటించిన జోగ్వా సినిమాలోది. 2009లో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన జోగ్వా సినిమాలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాకు ఉపేంద్ర జాతీయ చలనచిత్రా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. తాయప్ప అనే పాత్రలో చీర కట్టులో నటించారు ఉపేంద్ర. దేవదాసి సంప్రదాయం ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు రూపొందించారు. మరాఠీ సినిమా ఇండస్ట్రీలో ఉపేంద్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
View this post on Instagram