Deepika Padukone : దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ సినిమా నుంచి నటి దీపికా పదుకొనే తప్పుకుందనే వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ తర్వాత దీపికా విషయంలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తల మధ్యే ఇప్పుడు దీపికా పదుకొనే చేసిన ఒక వ్యాఖ్య, సందీప్ రెడ్డి వంగాతో ఆమెకు ఉన్న వివాదం మీదే అని అందరూ భావిస్తున్నారు. దీపిక వ్యాఖ్యల తర్వాత ఈ వ్యవహారం మరింత ముదురుతోంది.
మంగళవారం (మే 27న) దీపికా పదుకొనే స్టాక్‌హోమ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో రెడ్ కార్పెట్‌పై కనిపించింది. ఆమె కార్టియర్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఆ ఈవెంట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వోగ్ అరబియాతో మాట్లాడుతూ.. తన జీవిత తత్వశాస్త్రం (philosophy) గురించి చర్చించింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను ఎప్పుడైనా కష్టమైన పరిస్థితులను లేదా క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు నా అంతరాత్మ చెప్పిన మాటలను వింటాను. ఆ నిర్ణయాలనే తీసుకుంటాను, ఆ నిర్ణయాలకే కట్టుబడి ఉంటాను. అవి నాకు ప్రశాంతతను ఇస్తాయి. ఆ సమయంలోనే నేను అత్యంత సమతుల్యంగా ఉన్నట్లు భావిస్తాను” అని అన్నారు.
ఈ ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపికా అభిమానులు ఆమె మాటలను సందీప్ రెడ్డి వంగాతో ఉన్న వివాదానికి సంకేతంగా చూస్తున్నారు. ఆమె చెప్పిన మాటలు ఈ వివాదానికి సంబంధించినవి కావచ్చని భావిస్తున్నారు.
వైరల్ అవుతున్న దీపికా పదుకొనే వీడియోపై ఒక నెటిజన్, ఆమె నిజం చెబుతోంది అని కామెంట్ చేశారు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే గత వారం, ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా తప్పుకుందని వార్తలు వచ్చాయి. త్రిప్తి డిమ్రిని ఈ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ చేశారని వార్తలు రావడంతో దీపికా సినిమా నుంచి తప్పుకోవడంపై వివాదం మళ్ళీ మొదలైంది.
పలు నివేదికలలో దీపికా “నాన్-ప్రొఫెషనల్” డిమాండ్ల కారణంగానే సినిమా నుంచి తప్పుకుందని పేర్కొన్నారు. ఆ తర్వాత, ‘స్పిరిట్’కు సంబంధించిన పుకార్ల గురించి సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో ఆగ్రహంగా ఒక పోస్ట్ చేయడం ఈ అలజడిని మరింత పెంచింది. ఈ పోస్ట్‌లో ఆయన దీపికా పదుకొనేను పరోక్షంగా విమర్శించారని కొందరు భావిస్తున్నారు.
Also Read : మనసు చెప్పిందే వింటాను.. దీపికా పదుకొణె ఆసక్తికర కామెంట్స్