Childhood Photo : చిన్నతనంలో తమకు ఇష్టమైన హీరో హీరోయిన్లు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చైల్డ్ హుడ్ ఫోటోల ట్రెండ్ పాపులర్ అయ్యింది. తాజాగా ఒక టాలీవుడ్ హీరోయిన్ కు సంబంధించిన మిస్ ఇండియా త్రో బ్యాక్ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటుంది. ఒక స్టార్ హీరోయిన్ కి సంబంధించిన త్రో బ్యాక్ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో గ్రీన్ కలర్ సారీ లో ఉన్న అమ్మాయి తెలుగులో టాప్ హీరోయిన్. అంతేకాదు ఆమె మిస్ ఇండియా కూడా అయ్యింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు అందరికీ జోడిగా నటించే ప్రేక్షకులను మెప్పించింది. లేటెస్ట్ గానే తన చెల్లెలితో దిగిన ఫోటోను సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నిన్న తోబొట్టుల దినోత్సవం జరిగిన సందర్భంగా ఈ స్టార్ హీరోయిన్ కూడా తన చెల్లెలితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అంటే తన చెల్లిపై ఉన్న తన ప్రేమను బయట పెట్టింది. ఈ త్రో బ్యాక్ ఫోటో ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఈమె మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, ఒకప్పటి హీరోయిన్ మరియు మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని. నిన్న తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా నమ్రత శిరోద్కర్ తన చెల్లెలితో ఉన్న ఫోటోను సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది.
Also Read : రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా.. ఇప్పుడు హీరోయిన్ గా…ఈ హాట్ బ్యూటీ స్టన్నింగ్ ఫోటోలు వైరల్
నమ్రత శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ సైతం తన అక్కతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంది. నా లైఫ్ లో నువ్వు అతిపెద్ద మద్దతుగా నిలిచే వ్యక్తి అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ త్రో బ్యాక్ ఫోటో సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు నమ్రత శిరోద్కర్ మిస్ ఇండియా గా కూడా గెలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో ఈమె మహేష్ బాబు అలాగే మెగాస్టార్ చిరంజీవికి జోడిగా సినిమాలలో నటించి మెప్పించింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత నమ్రత శిరోద్కర్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈమె తన భర్త మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటుంది. అలాగే నమ్రత శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ హిందీ బిగ్ బాస్ షోలోకి ఇటీవలే అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కి షోలో ఈమె తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకొని టాప్ 5 లో నిలిచి బాగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో శిల్పా శిరోద్కర్ చాలా ఆక్టివ్ గా ఉంటుంది.
View this post on Instagram