Chiranjeevi and Srikanth Odela : సినిమా ఇండస్ట్రీని దాదాపు 45 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంతో ఎలుతున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి… ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేశాయనే చెప్పాలి. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేశాయి.
ఇక ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది యంగ్ డైరెక్టర్స్ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తు ఉంటారు…ఇక చిరంజీవి మాత్రం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న యంగ్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేస్తూ ఆ దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వరం లా దొరికాడనే చెప్పాలి. ఇక దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లబోతుందనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని మాత్రం చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కనక మనం చూసినట్లైతే చాలా వైల్డ్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో చిరంజీవి తనను తాను ఎలా స్క్రీన్ ప్రజెంట్ చేసుకోగలుగుతాడనేది తెలియాల్సి ఉంది. మరి శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు ఒక స్టార్ ఇమేజ్ ఉన్న ఉన్న చిరంజీవిని హ్యాండిల్ చేయగలడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో వీళ్ళిద్దరూ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించి తద్వారా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక చిరంజీవి శ్రీకాంత్ ఓదెల ఇద్దరు ఒకరినిఒకరు కౌగిలించుకొని చేతులకు బ్లడ్ పూసుకున్న పోస్టర్ అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి వీళ్ళిద్దరూ కలిసి చేయబోతున్న ఈ కొత్త సినిమాతో దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవ్వబోతున్నాయనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే వింటెజ్ చిరంజీవి ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి చిరంజీవి అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. శ్రీకాంత్ ఓదెల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మొదటి సినిమాతోనే తను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక ప్రతి విషయం లో చాలా క్యాలిక్యులేటెడ్ గా సినిమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నాని ని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ ఎత్తున సినిమాలను చేయడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…