https://oktelugu.com/

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భారీ ట్విస్ట్

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్య ట్విస్ట్ నెలకొంది. ఓవైపు జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సినీ సెలబ్రెటీలను వరుసగా విచారిస్తున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినీ సెలబ్రెటీలకు గొప్ప ఊరటనిచ్చే నిర్ణయాన్ని వెలువరించింది.ఏకంగా 16మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ సెలబ్రెటీలకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రెటీలకు భారీ ఊరట లభించినట్టైంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2021 6:59 pm
    Follow us on

    Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్య ట్విస్ట్ నెలకొంది. ఓవైపు జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సినీ సెలబ్రెటీలను వరుసగా విచారిస్తున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినీ సెలబ్రెటీలకు గొప్ప ఊరటనిచ్చే నిర్ణయాన్ని వెలువరించింది.ఏకంగా 16మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ సెలబ్రెటీలకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రెటీలకు భారీ ఊరట లభించినట్టైంది.

    టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నివేదికలో డ్రగ్స్ వాడనట్లుగా తేలడంతో 16 మంది సినీ ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్, చార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, నందు, తనీష్,రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ తోపాటు ఆరుగిరికి ఫోరెన్సిక్ సైన్స్ క్లీన్ చిట్ ఇచ్చింది.

    2017లో వాళ్లు ఇచ్చిన గోళ్లు, వెంట్రుకలు, రక్తం నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చి చెప్పింది. 2017 జూలైలో పూరి జగన్నాథ్, తరుణ్ సహా 16మంది నుంచి ఎక్సెజ్ శాఖ నమూనాలు సేకరించింది. దీనిపై గతేడాది డిసెంబరు 8న ఎఫ్ ఎస్ ఎల్ నివేదికలు సమర్పించినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కెల్విన్ పై ఛార్జాషీట్ తో పాటు ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక వివరాలను కోర్టుకు సమర్పించినట్లు ఎక్సైజ్ అధికారులు వివరించారు.

    సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది డ్రగ్స్ రాకెట్. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు 62 మందిని అప్పట్లో విచారించింది సిట్. ఎంతటి వారినైనా వదలిపెట్టేది లేదు అన్న చందంగా సాగిన విచారణలో ప్రముఖుల పేర్లు ఈ రాకెట్ లో ఉన్నాయన్న వార్తలతో నీరుగారిపోయింది.

    సుదీర్ఘ విచారణ తరువాత మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్. డ్రగ్స్ సరఫరాదారులు, రవాణా చేసిన వారిని మాత్రమే కేసుల్లో చేర్చింది. ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. 16 మంది అగ్రతారలు కూడా అప్పటి విచారణకు హాజరయ్యారు. రవితేజ, చార్మి, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. తాజాగా వీరిందరికీ తెలంగాణ సర్కార్ క్లీన్ చిట్ ఇచ్చి ఉపశమనం ఇచ్చింది.