Kartika Masam: పురాణాల ప్రకారం కార్తీకమాసానికి ఉండే ప్రాముఖ్యత, ప్రాధాన్యత అంతాఇంతా కాదు. కార్తీకమాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుందని చెప్పవచ్చు. కార్తీకమాసంలో దీపానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం కోసం ఉపయోగించే వత్తులతో పాటు అందులో పోసే నూనెకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. దీపాల కోసం ఒక వత్తిని ఎప్పుడూ ఉపయోగించకూడదు.
పత్తితో తయారు చేసిన వత్తిని దీపారాధన కోసం వినియోగించడం శ్రేష్టమని చెప్పవచ్చు. కుటుంబంలో సర్వ సుఖాలు, సౌభాగ్యాలు కలగాలని కోరుకునే వాళ్లు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిదని చెప్పవచ్చు. నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే పీడలు, సమస్త దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆముదంతో దీపారాధన చేయడం ద్వారా జీవితం దేధీప్యమానమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
వేరుశనగ నూనెతో మాత్రం దీపారాధన చేయకపోతేనే మంచిది. వేరుశనగ నూనెతో దీపారాధన చేయడం వల్ల రుణ బాధలు పెరగడంతో పాటు మానసిక ఆందోళన వెంటాడే అవకాశాలు ఉంటాయి. తెల్లవారు జామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య దీపారాధన చేస్తే మంచిది. ఉత్తరం దిక్కున దీపం వెలిగిస్తే ధనాభివృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి దీపాలను వెలిగిస్తే మంచిదని చెప్పవచ్చు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత దీపారాధన చేసి నియమాలను పాటిస్తే సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది.
Also Read: దివాళీ రోజున బాణసంచా.. తెలుగు రాష్ట్రాల్లో అనుమతి ఉందా??
కార్తీక మాసం విశిష్టత ఏంటి? ఈ మాసంలో దేవుడిని ఎలా పూజించాలో తెలుసా?