సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తెలుగు సినీరంగ ప్రముఖులు కలుసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత డి.సురేష్ బాబు తదితరులు సినిరంగానికి చెందిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువెల్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. సమావేశం అనంతరం వివారాలను ప్రముఖ నటులు చిరంజీవి మీడియాకు వెల్లడించారు. సినీ కళాకారులను ప్రోత్సాహహించేందుకు నంది అవార్డులు ప్రకటించాలని కోరగా 2019-20 లో సినిమాలకు […]

Written By: Neelambaram, Updated On : June 9, 2020 7:46 pm
Follow us on


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తెలుగు సినీరంగ ప్రముఖులు కలుసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత డి.సురేష్ బాబు తదితరులు సినిరంగానికి చెందిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువెల్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.

సమావేశం అనంతరం వివారాలను ప్రముఖ నటులు చిరంజీవి మీడియాకు వెల్లడించారు. సినీ కళాకారులను ప్రోత్సాహహించేందుకు నంది అవార్డులు ప్రకటించాలని కోరగా 2019-20 లో సినిమాలకు త్వరలో అవార్డులు ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడి ఉన్నందున థియేటర్లకు మినిమమ్ ఫిక్స్డ్ చార్జెస్ ఎత్తివేయాలని కోరామన్నారు. దీనికి సీఎం అంగీకరించారని తెలిపారు. టికెటింగ్ లో పారదర్శకత ఉండాలని మేము కోరగా, దానిపై కూడా త్వరలోనే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటమన్నారు.

సినిమా బడ్జెట్ ఆధారంగా టికెట్ ధర పెంచే, తగ్గించే విధానాన్ని ముంబై, చెన్నై, బెంగుళూరులలో అనుసరిస్తున్నారని ఇక్కడ అదే విధానాన్ని అమలు చేయాలని కొత్త సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారన్నారు.

ఈ నెల 15వ తేదీ నుంచి షూటింగ్ లకు రాష్ట్రంలో అనుమతి ఇవ్వడం హర్షణీయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సినీ పరిశ్రమకు 300 ఎకరాలను కేటాయించారని, అలానే ఉన్న ఆ భూములపై త్వరలో పునఃపరిశీలించి సినీ పరిశ్రమ అభివృద్ధికే కేటాయిస్తానని సీఎం చెప్పారన్నారు. ఈ చర్చలు ఎంతో సానుకూలంగా జరిగాయన్నారు. ఈ భేటీలో సినీ ప్రముఖులు సి.కల్యాణ్, దిల్‌రాజు, రాజమౌళిలు తదితరులు పాల్గొన్నారు.