https://oktelugu.com/

Tollywood Cinema : సినిమాలు మానేసి.. కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్..

కొంతమంది హీరోయిన్లు ఆదాయం కోసం సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తారు. కానీ ప్రీతి అలా చేయలేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు పలు వ్యాపారాలను ప్రారంభించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 10, 2024 / 10:09 AM IST

    star herohine preethi

    Follow us on

    Tollywood Cinema : చిత్ర సీమలో నటులకు అవకాశాలు ఉన్నంత వరకే సంపాదన ఉంటుంది. ఆ తరువాత ఆదాయం కోసం సరైన ఛాన్స్ లు రాకపోవడంతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవితం గడుపుతారు. అయితే కొందరు స్టార్లు మాత్రం ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి..’అన్నట్లు సినిమాల్లో ఉండగానే ఇతర వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు లేకపోయినా పెద్దగా టెన్షన్ పడకుండా తమ వ్యాపారాలు నిర్వహించుకుంటారు. లేటేస్టుగా ఓ స్టార్ హీరోయిన్ సినిమాల్లో కొనసాగకపోయినా పలు వ్యాపారాలు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతుంది. తనకు సినిమాల్లో కంటే ఇప్పుడు ఎక్కువ వస్తున్నట్లు పలువురితో చెప్పింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

    టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఏ రాష్ట్రం నుంచైన రావడానికి కొందరు హీరోయిన్లు వెనుకాడరు. అలా మలయాళం, తమిళ ఇండస్ట్రీల నుంచి ఎందరో భామలు ఇక్కడి సినిమాల్లో నటించి అలరించారు. అలాంటి వారిలో ప్రీతి రాజ్ కుమార్ ఒకరు. ‘రుక్మిణి’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈమెను మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత ‘ప్రియమైన నీకు’ సినిమాలో కాస్త నెగెటివ్ రోల్ చేసేసరికి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసి గుర్తింపు పొందారు. ఆ తరువాత ప్రముఖ డైరెక్టర్ హరి ని పెళ్లి చేసుకొని ప్రస్తుతం హాయిగా జీవిస్తోంది.

    herohine preethi

    కొంతమంది హీరోయిన్లు ఆదాయం కోసం సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తారు. కానీ ప్రీతి అలా చేయలేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు పలు వ్యాపారాలను ప్రారంభించింది. ఆమెకు చెన్నైలోని సముద్ర తీరాన ఓ కల్యాణ మండపం ఉంది. అలాగే ‘మద్రాసు కాఫీ’ పేరుతో ఔట్ లెట్ ను ప్రారంభించింది. విశేషమేంటంటే.. ఇందులో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. దీని ప్రాంచైజీలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా అవి సక్సెస్ అయ్యాయి. అలాగే సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోలను మెయింటేన్ చేస్తున్నారు.

    ఓ వైపు భర్త హరి ‘సింగం’, ‘యముడు’ సినిమాలతో హల్ చల్ సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రీతి వ్యాపారాలతో కోట్ల రూపాయాల ఆదాయం ఆర్జిస్తోంది. ఇలా ఆమె జీవితం మూడు పూవులు ఆరు కాయలు అన్నట్లుగా ఆనందంగా సాగుతోంది. అయితే ప్రీతీ ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు అన్న విషయం తెలిసిందే. తండ్రి సహకారంతో సినిమాల్లోకి వచ్చిన ఆమె సొంతంగా డబ్బు సంపాదించడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.