https://oktelugu.com/

Bigg Boss Amardeep: స్వీట్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ అమర్… మేటర్ లీక్ చేసిన శ్రీముఖి!

అమర్ దీప్ హీరోగా సుప్రీత హీరోయిన్ గా ఓ సినిమా ప్రారంభం అయింది. తాజాగా అమర్ దీప్ భార్య తేజస్విని తో కలిసి వాలెంటైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 10, 2024 / 10:12 AM IST
    Follow us on

    Bigg Boss Amardeep: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అమర్ దీప్ చౌదరి పేరు ఈ మధ్య గట్టిగా వినిపించింది. బిగ్ బాస్ షోకి వెళ్లక ముందు అమర్ దీప్ జానకి కలగనలేదు సీరియల్ లో నటించాడు. బుల్లితెర ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. సీరియల్ నటి తేజస్విని గౌడ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సీరియల్స్ తో పాటు స్టార్ మా లో ప్రసారమైన నీతోనే డాన్స్ షో లో అమర్, తేజస్విని పాల్గొన్నారు. ఈ జంటకు నీతోనే డాన్స్ షో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

    ఆ తర్వాత కూడా పలు ఈవెంట్లు, షో లకు కలిసి హాజరవుతూ సందడి చేశారు. అయితే అమర్ దీప్, తేజస్విని పెళ్లి చేసుకుని ఏడాది పైనే అవుతుంది. అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మొదటి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమర్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ఒక పక్క బుల్లితెర పై రాణిస్తూ … త్వరలోనే వెండితెర పై మెరవనున్నాడు.

    అమర్ దీప్ హీరోగా సుప్రీత హీరోయిన్ గా ఓ సినిమా ప్రారంభం అయింది. తాజాగా అమర్ దీప్ భార్య తేజస్విని తో కలిసి వాలెంటైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ ఈవెంట్ లో పాల్గొన్నారు. వారితో పాటు బుల్లితెర జంటలు హాజరయ్యారు. ఈ షో యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. ఇక ఈ జంటలతో శ్రీముఖి రొమాన్స్ చేయించింది. ఫన్నీ గేమ్స్ ఆడించింది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

    శ్రీముఖి అమర్ దీప్, తేజు గురించి మాట్లాడుతూ .. త్వరలో బేబీ రాబోతుంది .. పేరెంట్స్ అవ్వబోతున్నారు అంటూ సీక్రెట్ లీక్ చేసింది. కానీ ఈ విషయం గురించి అమర్, తేజు అఫీషియల్ గా ఎక్కడా ప్రకటించలేదు. అయితే శ్రీముఖి జోక్ చేసిందా లేక నిజంగానే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. అమర్ దీప్ బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ రేసులో నిలిచాడు. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా, రన్నర్ తో సరిపెట్టుకున్నాడు.