Sirivennela Seetharama Sastry: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు చలన చిత్ర సీమకే కాదు.. తెలుగువారికి కూడా విషాదకరమైన సంఘటనే. సినీ ప్రముఖులు, అభిమానులు ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ‘సిరివెన్నెల’ అంతిమయాత్ర మహాప్రస్థానం చేరుకుంది. ‘సిరివెన్నెల’ గారిని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, జనాలు అంతిమయాత్రకు కూడా తరలిరావడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. అందరూ కన్నీళ్లతో ఆ అక్షర శిల్పికి అశ్రునివాళి అర్పించారు.
మహేశ్ బాబు బాబు మాట్లాడుతూ.. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారు లేకుండా తెలుగు సినిమా పాటలు ఎలా ఉంటాయో అని ఊహించడానికి కూడా కష్టంగానే ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని అన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘సీతారామశాస్త్రిగారు నాకు ‘రుద్రవీణ’ రోజుల నుంచే పరిచయం. ‘జానీ’ సినిమా పాటల కోసం కూర్చున్నప్పుడు సాహిత్యం, విలువల గురించి మాట్లాడుకునేవాళ్లం. అలాంటి కవి, సాహితీవేత్త కన్నుమూయడం దురదృష్టకరం. కొన్ని దశబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకు సేవ చేయాల్సిన వ్యక్తి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని తెలిపారు పవన్ .
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు ఆవేదన, బాధను వ్యక్తపరచడానికి మాటలు రావు. అలాంటి మాటలను ఆ మహానుభావుడు తన కలంతో వ్యక్తపరిచేవారు. ఇప్పుడు నా ఆవేదనను కూడా ఆయన తన కలంతో వ్యక్త పరిస్తే బాగుండేదేమో. సీతారామశాస్త్రి కలం ఆగినా, ఆయన రాసిన పాటలు తెలుగుజాతి, భాష బ్రతికున్నంత కాలం చిరస్మరణీయంగా ఉంటాయి. తెలుగు సాహిత్యంపై ఆయన చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు.
Also Read: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన మహేష్ బాబు…
నాగార్జున మాట్లాడుతూ… ‘సీతారామశాస్త్రిగారితో నాకు ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. ఆయనను ఎప్పుడు కలిసినా ‘మిత్రమా ఏం చేస్తున్నావు’ అని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పిలిచేవారు. నాకు బాగా గుర్తు, ‘తెలుసా.. మనసా’ పాటను నేను ఆయన పక్కన కూర్చుని రాయించుకున్నాను. స్వర్గంలో కూడా ఆయన దేవుళ్లకు తన పాటలు, మాటలు వినిపిస్తారని అనుకుంటున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని నాగార్జున చెప్పారు.
మంత్రి హరీశ్ రావు మాటల్లో.. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు పండితులను, పామరులను మెప్పించగలిగిన గొప్ప వ్యక్తి. గొప్ప రచయిత. ఆయన మరణం, తెలుగు సినీ పరిశ్రమకు, సాహిత్య రంగానికి తీరని లోటు. సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలి’ అని మంత్రి హరీశ్ రావు కోరుకున్నారు.
Also Read: Sirivennela Family: సిరివెన్నెల కుమారులు ఇద్దరు ఇండస్ట్రీలోనే ఉన్నారని మీకు తెలుసా?
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Tollywood celebs pay their last respects to sirivennela seetharama sastry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com