https://oktelugu.com/

Sri Simha Pre wedding :పెద్ద కొడుకు పెళ్లి కాకుండానే చిన్న కొడుకు శ్రీ సింహ పెళ్లి చేసేస్తున్న కీరవాణి.. ఎవరెవరు వచ్చారో తెలుసా?

మొన్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఎలాంటి హడావుడి లేకుండా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అలాగే హీరో నారా రోహిత్ కూడా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అలాగే హీరో కిరణ్ అబ్బవరం కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు.

Written By:
  • Rocky
  • , Updated On : November 18, 2024 / 11:53 AM IST

    Sri Simha Pre wedding

    Follow us on

    Sri Simha Pre wedding :  ఈ మధ్యకాలంలో పలువురు సెలబ్రిటీలు, టాలీవుడ్ యంగ్ హీరోలు సైలెంట్ గా పెళ్లి చేసుకుని తమ బ్యాచిలర్ జీవితాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఎలాంటి హడావుడి లేకుండా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అలాగే హీరో నారా రోహిత్ కూడా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అలాగే హీరో కిరణ్ అబ్బవరం కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. తాజాగా ఈ లిస్ట్ లో మరో హీరో కూడా చేరిపోయాడు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత కీరవాణి కొడుకు, హీరో శ్రీసింహా పెళ్లికి రెడీ అయ్యాడు. నిన్న రాత్రి అతని ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీసింహా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటూ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

    వారితో పాటు మురళీ మోహన్‌కు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్‌ మోహన్‌.. ఈయన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్‌ మోహన్‌- రూపల కుమార్తెనే ‘రాగ’. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ఇక శ్రీసింహ విషయానికి వస్తే ‘యమదొంగ’ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశారు. ‘మత్తు వదలరా’ సీక్వెన్స్ రెండు చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించారు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. అతడికి కాకముందే చిన్నబ్బాయికి పెళ్లి జరగనుంది. దీంతో ఇది ప్రేమ పెళ్లి అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీసింహా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.