Homeఎంటర్టైన్మెంట్ఒకే వేదిక‌పై ‘ఉప్పెన‌’.. కలిసిన స్టార్ హీరోలు, డైరెక్టర్లు!

ఒకే వేదిక‌పై ‘ఉప్పెన‌’.. కలిసిన స్టార్ హీరోలు, డైరెక్టర్లు!

అభిమానుల‌కు త‌మ హీరో ఒక్క‌రు క‌నిపిస్తేనే ఆగ‌లేరు.. ఇక, ఇత‌ర న‌టులు, ద‌ర్శ‌కులు ఒకే వేదిక‌మీద క‌నిపిస్తే.. ఆ సంద‌డే వేరు. ఇలాంటి స‌న్నివేశానికి వేదికైంది ‘ఉప్పెన సెల‌బ్రేష‌న్స్‌’. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టి జంట‌గా న‌టించిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏ రేంజ్ విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఉప్పెన ధాటికి టాలీవుడ్లో ఎన్నో రికార్డులు కొట్టుకుపోయాయి. వ‌సూళ్ల సునామీ సృష్టించిందీ సినిమా! Also Read: ఈ ముగ్గురు ఫ‌ట్టు.. జాతిర‌త్నాలు […]

Uppena Blockbuster Celebrations
అభిమానుల‌కు త‌మ హీరో ఒక్క‌రు క‌నిపిస్తేనే ఆగ‌లేరు.. ఇక, ఇత‌ర న‌టులు, ద‌ర్శ‌కులు ఒకే వేదిక‌మీద క‌నిపిస్తే.. ఆ సంద‌డే వేరు. ఇలాంటి స‌న్నివేశానికి వేదికైంది ‘ఉప్పెన సెల‌బ్రేష‌న్స్‌’. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టి జంట‌గా న‌టించిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏ రేంజ్ విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఉప్పెన ధాటికి టాలీవుడ్లో ఎన్నో రికార్డులు కొట్టుకుపోయాయి. వ‌సూళ్ల సునామీ సృష్టించిందీ సినిమా!

Also Read: ఈ ముగ్గురు ఫ‌ట్టు.. జాతిర‌త్నాలు మ‌రింత హిట్టు!

విడుద‌లైన తొలి రోజు క్లైమాక్స్ విష‌యంలో కాస్త డివైడ్ టాక్ వినిపించిన‌ప్ప‌టికీ.. ఉప్పెన జోరులో అది లెక్క‌లోకే రాలేదు. మొద‌టి ఆట‌నుంచే అప్ర‌తిహ‌తంగా దూసుకెళ్లిన సినిమా.. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. త‌మ సినిమా వంద కోట్లు సాధించిందంటూ మైత్రిమూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం విశేషం. ఈ మేర‌కు 100 కోట్ల క‌లెక్ష‌న్ రాబ‌ట్టిన‌ట్టు పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ నేప‌థ్యంలో ‘సెల‌బ్రేష‌న్ ఉప్పెన’ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, ద‌ర్శ‌కులు సుకుమార్‌, గోపీచంద్ మ‌లినేని, హ‌రీశ్ శంక‌ర్‌, శ్రీరామ్ వేణు, దిల్ రాజు, ప్ర‌సాద్ పొట్లూరి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Also Read: వకీల్ సాబ్ టెన్షన్.. ఆడితే ఓకే.. లేకుంటే?

ఈ వేడుక‌కు సంబంధించిన చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. హాజ‌రైన హీరోలు, ద‌ర్శ‌కుల్లో ఎవ‌రితో ఎవ‌రు సినిమా చేయ‌బోతున్నార‌నే డిస్క‌ష‌న్ స్టార్ట్ చేశారు. అయితే.. మెగాస్టార్, అల్లు అర్జున్ తోపాటు ద‌ర్శ‌కుడు గోపీచంద్ కూడా మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సినిమాలు చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper