https://oktelugu.com/

Tollywood Actress : ఈ పాప.. ఇటీవల మహేష్ పక్కన నటించి అలరించింది.. అలా అని శ్రీ లీల కాదు.. మరెవరు?

గతంలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ సినిమాలో నటిస్తోంది. అయితే ఇటీవల తన చిన్న నాటి పిక్ ను బయటపెట్టడంతో అభిమానులు ఆసక్తి చూపుతున్నారు . ఇంతకీ ఆమె ఎవరంటే?

Written By: , Updated On : February 14, 2024 / 04:28 PM IST
meenakshi choudary gunturu kaaram

meenakshi choudary gunturu kaaram

Follow us on

Meenakshi Choudary: కొందరు హీరోయిన్లు తమ స్పెషల్ డేస్ రోజున అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తుంటారు. ఒకప్పుడు తమ లేటేస్ట్ ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు తమ చిన్న నాటి పిక్స్ ను బయటపెడుతున్నారు. ఈ ఫొటోలో ఉన్న పాప ఇటీవల మహేష్ నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో కనిపించింది. అలా అని హీరోయిన్ శ్రీలీల అనుకోవద్దు. ఆమె మరో బ్యూటీ. గతంలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ సినిమాలో నటిస్తోంది. అయితే ఇటీవల తన చిన్న నాటి పిక్ ను బయటపెట్టడంతో అభిమానులు ఆసక్తి చూపుతున్నారు . ఇంతకీ ఆమె ఎవరంటే?

చాలా మంది యువతులు సినిమాల్లో అవకాశాలు వస్తే వదులుకోరు. అలాగే ఈమె కూడా మొదట్లో సినిమాల్లో నటించాలని ఆశ ఉండడంతో ఏ అవకాశం వచ్చినా వదులుకోలేదు. అలా మొదటిసారిగా ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ అనే సినిమాలో కనిపించింది. కానీ ఆ సమయంలో ఈ ముద్దుగుమ్మను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అడవి శేషు హీరోగా వచ్చిన ‘హిట్’ అనే సినిమాలో కనిపించింది. అయితే ఇందులో ‘ఉరికే ఉరికే మనసే ఉరికే’ అనే సాంగ్ లో కనిపించి ఆకట్టుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో కనిపించినా సరైన అవకాశాలు రాక తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది.

అయితే తాజాగా ఈమె మహేష్ ఈరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలో కనిపించింది. అలాగని శ్రీలీల అనుకోవద్దు. ఆమె అలాగే ఎంతో అందంగా కనిపించిన మీనాక్షి చౌదరి. ఈమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సినిమాల్లోకి వచ్చిన నటి మాత్రమే కాకుండా మిస్ ఇండియా 2018 పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో విన్నర్ కాకపోయినా రన్నర్ గా మాత్రం నిలిచారు. అప్పటి నుంచి మీనాక్షి సోషల్ మీడియాకు పరిచయం అయ్యారు.

కానీ ‘హిట్’ సినిమా నుంచి సెలబ్రెటీగా మారారు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి బిజీ హీరోయిన్ గా మారారు. మట్కా అనే సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్ లతో కలిసి నటిస్తోంది.ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు మీనాక్షి చౌదరి గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. అయితే ఈ అమ్మడు ముందు ముందు సినిమాల్లో ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.