Bollywood: తెలుగు సినిమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ప్రతి హీరోయిన్, బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ కోసం ఆరాటపడుతుంది. పూజా హెగ్డే, రష్మిక, చివరకు స్టార్ డమ్ లేని నభా నటేష్ కూడా బాలీవుడ్ వైపు చూస్తోంది. ఆ మధ్య ఇలియానా, శ్రియా, కాజల్ ఇలా ఒకరు ఏమిటి ? దాదాపు అవకాశం ఉన్న ప్రతి హీరోయిన్ బాలీవుడ్ చూపులే చూస్తోంది.
ఎవరినైనా నువ్వు ప్రధాన మంత్రి అవుతావా ? ముఖ్య మంత్రి అవుతావా ? అంటే ప్రధానమంత్రే అంటారు, హీరోయిన్లకు కూడా తెలుగు హీరోయిన్ కంటే, బాలీవుడ్ హీరోయిన్ అని పిలిపించుకోవడంలోనే ఎక్కువ సంతోషం ఉంది. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాలలోనే ఆడతాయి. అదే హిందీ సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంటుంది.
అంటే.. ఎక్కువ మార్కెట్ ఉంటే.. ఎక్కువ రెమ్యునరేషన్ వస్తోంది. అందుకే ప్రతి హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ కోసమే చూస్తోంది. తాము బాలీవుడ్ లో రాణించగలిగితే.. డబ్బుకు డబ్బు, పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు. చాలామంది హీరోయిన్లు నార్త్ నుండి ఇక్కడ వచ్చి సక్సెస్ అవుతున్నారు. మనవాళ్ళు నార్త్ హీరోయిన్ లను బాగానే ఆదరిస్తున్నారు.
ఇక్కడ కాస్త పేరొస్తే చాలు, నార్త్ భామలు బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ మధ్య మన హీరోలు కూడా పాన్ ఇండియా మూవీలు అంటున్నారు. చూద్దాం ఎంతమంది హీరోలు బాలీవుడ్ లో సక్సెస్ అవుతారో. అయితే, హీరోలకు ఎందుకో తగిన ఆదరణ లేదు. ప్రభాస్ కు మాత్రం బాహుబలి ద్వారా గుర్తింపు వచ్చింది.